Big Stories

Adani coal scam Issue: అదాని భారీ బొగ్గు కుంభకోణం.. వెనక నడిపించేది ఎవరు?

- Advertisement -

వ్యాపారం.. మన కొన్న డబ్బుకు కొంత లాభం చూసుకొని అమ్మడం.. బట్ ఆ లాభం ఎంత ఉంటుంది. అయితే టెన్‌ పర్సెంట్.. 20 పర్సెంట్‌ మహా అయితే 50 పర్సెంట్.. కానీ 300 పర్సెంట్‌ ఉంటే.. దాన్ని వ్యాపారం కాదు.. మోసం అని అనాలి.. స్కామ్ అనాలి.. ఇప్పుడీదే స్కామ్‌ను అదానీ గ్రూప్ చేసింది అని చెబుతోంది ఆర్గనైజ్‌డ్ క్రైమ్‌ అండ్ కరప్షన్‌ రిపోర్టింగ్ ప్రాజెక్ట్.. సింపుల్‌గా OCCRP అని పిలుచుకుందాం ఈ సంస్థను.. 2014లో జనవరి 9న జరిగిన డీల్‌ గురించి ఈ విషయం రీసెంట్‌గా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అప్పుడు జరిగింది ఏంటంటే.. ఆ రోజు ఓ భారీ షిప్‌ చెన్నై హార్బర్‌లో డాక్ అయ్యింది. ఈ షిప్‌ ఇండోనేషియా నుంచి 69 వేల 925 మెట్రిక్ టన్నుల బొగ్గును మోసుకొచ్చింది.

- Advertisement -

ఈ బొగ్గును తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌.. అంటే తమిళనాడు విద్యుత్ ఉత్పత్తి సంస్థ కొనుగోలు చేసింది. ఎంతకు అంటే.. ఒక్కో మెట్రిక్ టన్నును 91.91 యూఎస్‌ డాలర్ల ధర చొప్పున..ఇందులో ఏముంది.. ఇది నార్మల్ వ్యాపారమే కదా అంటారా? కానీ ఇక్కడే అసలు మతలబుంది. ఈ బొగ్గు ఇండోనేషియాలోని మైనింగ్ కంపెనీ జాన్ లిన్‌ ది.. ఆ జాన్‌ లిన్‌ నుంచి కేవలం 28 డాలర్లకు కొనింది అదానీ కంపెనీ.. అయితే తమిళనాడుకు వచ్చే సారికి మాత్రం రేటు 91 డాలర్లకు చేరింది..
ఇదే అసలైన మ్యాజిక్.. ఈ మాయ అక్కడితో ఆగలేదు.. షిప్‌ ఇండోనేషనియా నుంచి ఇండియాకు వచ్చేసరికి నాణ్యత కూడా ఆమాంతం పెరిగిపోయింది. లో క్వాలిటీ 3500 కేలరీస్ పర్ కిలోగ్రామ్‌ తో ఉన్న దీన్ని.. అదానీ గ్రూప్‌ హైక్వాలిటీ అయిన 6వేల కేలరీస్ పర్ కిలోగ్రామ్ అంటూ తమిళనాడు ప్రభుత్వ సంస్థకు అమ్మేసింది.

Also Read: రూ.8 వేలకే మారుతీ వ్యాగన్ ఆర్‌.. ఎలానో తెలుసా..?

మరి ఈ మార్గం మధ్యలో ఏం జరిగింది? సముద్రంలో ఏం మాయ జరిగింది? ఇదే క్వశ్చన్‌కు ఆన్సర్ కోసం తవ్వితే.. అదానీ గ్రూప్ పేరు బయట పడింది అని చెబుతోంది దీనిపై రీసెర్చ్ చేసిన సంస్థ.. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇండోనేషియాలో బయల్దేరిన షిప్ నేరుగా ఇండియాకు రాలేదు. మధ్యలో వర్జీనియా ఐలాండ్స్‌లో ఆగింది. తెలుసుగా ఈ ఐలాండ్స్‌ పన్ను ఎగవేత దారులకు ఓ స్వర్గధామం.. సో.. అక్కడున్న సుప్రీమ్ యూనియన్ ఇన్వెస్టర్స్‌ అనే సంస్థ ఈ బొగ్గును కొని.. అదానీకి అమ్మినట్టు ఇన్వాయిస్‌లు లభించాయి. ఇండోనేషియాలో 28 డాలర్లు ఉన్న ప్రైస్.. వర్జీనియా ఐలాండ్స్‌కు వచ్చేసరికి 33.75 డాలర్లకు చేరింది. క్వాలిటీ వచ్చేసి 3 వేల 500.. సో.. అదానీ గ్రూప్‌కు కొన్నది 33.75 డాలర్లు అని తేలిపోయింది. ఇక షిప్ మళ్లీ అక్కడి నుంచి బయలుదేరి.. చెన్నైకు వచ్చేసరికి ఆ రేట్ 91 డాలర్లకు చేరింది. క్వాలిటీ కూడా 6 వేలకు చేరింది. మరి ఇది ఎలా జరిగింది? అనేది ఓ పెద్ద మిస్టరీ అనే చెప్పాలి..

రేటు పెరిగిందంటే ఓకే.. క్వాలిటీ ఎలా పెరిగిందనేది ఇప్పుడు మెయిన్ క్వశ్చన్.. అదానీ గ్రూప్‌ చేసిన చేసిన టెస్ట్‌ల్లో నాణ్యత పెరిగిందంటే ఓకే.. కానీ తమిళనాడు విద్యుత్‌ సంస్థలు కూడా ఎలాంటి నాణ్యతా టెస్ట్‌లు చేయలేదా? అనేది ఇప్పుడు క్వశ్చన్.. సరే ఇదంతా పక్కన పెడితే.. మరి ఈ విషయం ఇప్పటి వరకు బయటపడలేదా? అంటే పడింది.. డైరెక్టరేట్ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ ముందే ఈ విషయాన్ని పసిగట్టింది. రంగంలోకి దిగింది.. దర్యాప్తు ప్రారంభించింది. బట్ అదానీ గ్రూప్ తెలివిగా కోర్టుకు వెళ్లింది.. తమ ఇన్‌వాయిస్‌లను కోరవద్దని కోర్టులో పిటిషన్ వేసింది. మరి అక్కడ ఎలాంటి వాదనలు జరిగాయన్నది ఇంకా బయటికి రాలేదు కానీ.. కోర్టు మాత్రం అదానీ గ్రూప్‌కే అనుకూలంగా తీర్పు ఇచ్చింది..
దీంతో DRI వెనక్కి తగ్గాల్సి వచ్చింది.. ఇప్పుడు లీక్‌ అయిన డాక్యుమెంట్స్‌ కూడా DRI నుంచే అయినట్టు తెలుస్తోంది.

నిజానికి ఇలా అధిక ధరకు కొనుగోలు చేయడం వల్ల నష్టపోయేది సామాన్యులే.. ఎందుకంటే ఇలా చెల్లించే డబ్బును మళ్లీ విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యుల వద్ద నుంచే వసూలు చేస్తారు. అండ్ ఇలా క్వాలిటీ లేని బొగ్గును మండించడం ద్వారా వాతావరణ కాలుష్యం పెరగడంతో పాటు.. విద్యుత్ తయారీకి ఎక్కువ బొగ్గును ఉపయోగించాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి బొగ్గును మండించినప్పుడు ఎక్కువ బూడిద కూడా వస్తుందంటున్నారు. అంటే ఇలాంటి బొగ్గు కారణంగా జేబులకు చిల్లు పడటంతో పాటు.. ఆరోగ్యాలు కూడా డేంజర్‌లో పడతాయన్నది నిపుణుల మాట.

ఇలా ఎక్కువ చెల్లింపు ద్వారా విద్యుత్ సంస్థలపై ఎంత భారం పడింది? ఈ క్వశ్చన్‌కి ఆన్సర్.. దాదాపు 6 వేల కోట్ల రూపాయలు. తమిళనాడు విద్యుత్ సంస్థలు అదానీ గ్రూప్‌కు ఏకంగా 6 వేల కోట్ల రూపాయలు చెల్లించినట్టు తమిళనాడుకు చెందిన NGO సంస్థలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇదంతా 2012 నుంచి 2016 మధ్య జరిగినట్టు చెబుతున్నాయి.. అయితే అదానీ గ్రూప్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టి పారేస్తుంది. 10 ఏళ్లు అయ్యింది కాబట్టి.. ఎగ్జాక్ట్ గా డేటా అందుబాటులో లేదని.. కానీ 2012 నుంచి 2016 మధ్య విద్యుత్ సంస్థలు కొనుగోలు చేసిన మొత్తం బొగ్గులో.. అదానీ గ్రూప్‌ వద్ద కొన్నది కేవలం 2 శాతం మాత్రమే అని చెబుతుంది అదానీ గ్రూప్..తాము వాతావరణ కాలుష్యానికి అస్సలు కారణం కాదని.. విద్యుత్ సంస్థల నష్టానికి అస్సలే కాదని బల్లగుద్దీ మరీ వాదిస్తుంది. తమ కంపెనీ రెప్యూటేషన్‌ను బద్నాం చేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తోంది అదానీ గ్రూప్.

Also Read: ఇక రోడ్లపై రచ్చే.. తక్కువ ధరకే కొత్త పల్సర్‌ను లాంచ్ చేసిన బజాజ్!

అయితే OCCRP చెస్తున్న ఆధారాలకు పక్కా ఆధారాలను చూపిస్తోంది. ఇన్‌వాయిస్‌లను రిలీజ్ చేసింది. అయితే ఇటు తమిళనాడు విద్యుత్ తయారీ సంస్థలు కానీ. ఇండోనేషియాలోని జాన్‌లిన్.. వర్జీనియా ఐలాండ్స్‌లో ఉన్న సుప్రీమ్ యూనియన్ ఇన్వెస్టర్స్‌ దీనిపై ఎలాంటి కామెంట్ చేయడం లేదు. అయితే ఇక్కడో విషయం మాత్రం చాలా క్లారిటీగా ఉంది. ఇండోనేషియాలోని జాన్‌లిన్‌ కంపెనీ ఎక్స్‌పోర్ట్‌ చేసే కోల్ క్వాలిటీ ఎప్పుడూ కూడా 4 వేల 200 దాటలేదు. బట్ అదానీ గ్రూప్ డెలివరీ చేసిన ప్రతి షిప్‌ మెంట్‌ క్వాలిటీ మాత్రం రికార్డుల్లో 6 వేలకు తగ్గలేదు. ఇలాంటివి ఏకంగా 22 నుంచి 24 షిప్‌మెంట్స్‌ మాత్రం చెన్నై తీరానికి చేరాయి.

వీటిలో ప్రతిసారి మెట్రిక్ టన్ను ధర 87 నుంచి 91 డాలర్ల మధ్యే ఉంది.. ఈ మొత్తం బొగ్గు సరఫరాతో 70 మిలియన్ డాలర్లను అదనంగా దండుకుంది అదానీ గ్రూప్‌.. అప్పట్లో రూపాయి విలువను బట్టి చూస్తే దాదాపు 450 కోట్లు.. సో మాయ జరిగింది.. ఆ మాయ చేసింది అదానీ గ్రూప్.. దీనిపై DRI ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి సుప్రీమ్ కోర్టును ఆశ్రయించింది DRI.. అయితే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఏకంగా మూడేళ్లు తీసుకుంది అదానీ గ్రూప్.. నెక్ట్స్‌ హియరింగ్ ఆగస్టు 6న ఉంది. మరి అప్పుడైనా విచారణ ముందుకు జరుగుతుందా? లేదా మళ్లీ వాయిదా పడుతుందా? చూడాలి.. కానీ.. అదానీ గ్రూప్ ఎలా ఎదిగింది.. ఎలా విస్తరిస్తోందన్నదానికి ఇదే ఎగ్జాంపుల్‌..

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News