BigTV English

Pinnelli Ramakrishna Arrest : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ ?

Pinnelli Ramakrishna Arrest : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ ?

Pinnelli Ramakrishna Reddy Arrest: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలో ఉన్న ఒక కంపెనీకి చెందిన గెస్ట్ హౌస్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇస్నాపూర్ లో లొకేషన్ కనిపించడంతో పటాన్ చెరు పోలీసుల సహాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లోనే పోలీసులు ఆయన్ను ఏపీకి తరలించనున్నారు.


మే 13న మాచర్లలోని పాల్వాయిగేట్ పోలింగ్ బూత్ లోకి వెళ్లిన పిన్నెల్లి.. ఆగ్రహంతో అక్కడున్న ఈవీఎంను ధ్వంసం చేశారు. ఆ వీడియో ఏపీలో సంచలనం రేపింది. వీడియో కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి చేరడంతో.. పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఆదేశించింది. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు పిన్నెల్లి కోసం హైదరాబాద్ కు చేరుకున్నారు. పిన్నెల్లి సోదరులు పరారవుతున్నారని తెలిసి వెంబడించగా.. సంగారెడ్డి వద్ద కార్లను వదిలి వెళ్లారు. అక్కడ కార్లను, డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మహారాష్ట్ర బీదర్ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందగా.. ఆ మార్గంలో గాలించారు. ఆయన డ్రైవర్ ను రుద్రారం వద్ద అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. మహారాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశారు. పిన్నెల్లిని పట్టుకోవడానికి పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలించారు. బీదర్ వెళ్లాలనుకున్న పిన్నెల్లి.. రూటు మార్చుకున్నట్లు గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.


Also Read: పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం.. లుకౌట్ నోటీసులు.. 7 ఏళ్లు జైలు శిక్ష..?

ఇప్పటికే.. ఏపీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి ముంబై లేదా గోవా పారిపోయేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. అందుకే NH65 మీదుగా పిన్నెల్లి వాహనాలు ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతోనే ఏపీ పోలీసులు పిన్నెల్లి వాహనాలను ఫాలో అయ్యారు.

సంగారెడ్డి పోలీసులకు సమాచారం అందించడంతో రుద్రారం వద్ద పిన్నెల్లి కారును గుర్తించి డ్రైవర్ ను కంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లి వాహనంలోనే ORR మీదుగా పోలీసు స్టేషన్ కు తరలించారు. పిన్నెల్లి వదిలి వెళ్లిన ఫార్చూనర్, బొలెరో, ఇన్నోవాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కందిలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు తరలించారు. పిన్నెల్లి అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు పిన్నెల్లి ఎప్పుడూ విధ్వంసం తోనే గెలుస్తాడని టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి అన్నారు. గత ఎన్నికల్లోనూ ఆయన దౌర్జన్యం చేసే గెలిచాడని, ఈసారి ఆయన అరాచకాలు ఇలా బయటపడ్డాయన్నారు. ప్రబుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసిన పిన్నెల్లిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నానన్నారు.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×