E-Paper
Advertisement

Prabhas Kalki 2: హిస్టరీ క్రియేట్ చేయబోతున్న ప్రభాస్.. ఏకంగా అన్ని వందల కోట్లా?

Prabhas Kalki 2: హిస్టరీ క్రియేట్ చేయబోతున్న ప్రభాస్.. ఏకంగా అన్ని వందల కోట్లా?
Advertisement

Prabhas Kalki 2:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలతో బిజీగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన 2024లో కల్కి 2898AD సినిమాతో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది ఈ సినిమా.. ప్రభాస్ భైరవ పాత్రలో అద్భుతంగా ఆకట్టుకున్నారు. దీపికా పదుకొనే, కమలహాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ , రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించిన ఈ సినిమా సీక్వెల్ పై ఇప్పుడు అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఆశ్చర్యపరుస్తున్న ప్రభాస్ రెమ్యూనరేషన్..

ఇకపోతే ఈ సినిమాలో కమలహాసన్ కనిపించేది 20 నిమిషాలే అయినా అంతకుమించి హైప్ క్రియేట్ చేస్తారని, సినిమా మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. పైగా ఈ సినిమా కోసం ఆయన ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు రావడంతో ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే అంతలోనే ప్రభాస్ రెమ్యూనరేషన్ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్ చరిత్ర సృష్టించడం ఖాయం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ కల్కి2 కోసం రూ.250 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారట.

నిజమైతే రికార్డ్ గ్యారెంటీ..

Advertisement

కల్కి సినిమా సూపర్ సక్సెస్ కావడం వల్లే ఈ భారీ మొత్తంలో ఆయన తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మొదటి హీరోగా చరిత్ర సృష్టిస్తారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో.. ఒకవేళ కల్కి 2 కోసం ప్రభాస్ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటే మాత్రం మిగతా సినిమాలకు ఇబ్బంది ఏర్పడుతుందనే అభిప్రాయం కూడా మొదలయ్యింది. మరి దీనిపై చిత్ర బృందం ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.

ALSO READ:Jr NTR: వామ్మో.. ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీ కోసం అన్ని కిలోల బరువు తగ్గారా..పాపం అందుకే ఇలా!

ప్రభాస్ తదుపరి సినిమాలు..

Advertisement

ప్రభాస్ తదుపరి సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది మారుతీ దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ సినిమా చేసి డిజాస్టర్ ను మూట కట్టుకున్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రముఖ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత కల్కి 2 సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×