E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – ఉద్యోగులకు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – ఉద్యోగులకు చేపట్టిన పనుల్లో విజయం
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 12వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి.  వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టె విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. 

వృషభం

Advertisement

ఉద్యోగులకు శ్రమ తప్పదు. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మాతృ వర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి.  ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి.  ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. 

మిథునం

మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. బంధు వర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.  ఉద్యోగమున పురోగతి సాధిస్తారు.

కర్కాటకం

Advertisement

వ్యాపారాలు సామాన్యం సాగుతాయి. ఆర్థిక పరంగా స్వల్ప ఇబ్బందులు తప్పవు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. బంధు మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. 

సింహం

వ్యాపారాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయపరంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి  నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి.

కన్య

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. నూతన ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు.  చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి.

వృశ్చికం

ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి అవరోధాలు తొలగుతాయి. ఆప్తుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. దూరపు బంధువులు ఆగమనం కలిగిస్తుంది. 

ధనుస్సు

మిత్రుల  నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. భూవివాదాలు పరిష్కారమౌతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రయాణాలు వీలైనంత వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మకరం

విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పాత మిత్రులను  కలుసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.  సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. 

కుంభం

ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహనయోగం ఉన్నది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి.

మీనం

ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. శత్రు సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఇంటాబయట ప్రోత్సాహకార వాతావరణం ఉంటుంది.  ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×