E-Paper
Advertisement

Suryakumar Yadav: నేను ఒక్క‌డినే కాదు, గిల్ కూడా స‌రిగ్గా ఆడ‌టం లేదు..బాంబ్ పేల్చిన సూర్య

Suryakumar Yadav: నేను ఒక్క‌డినే కాదు, గిల్ కూడా స‌రిగ్గా ఆడ‌టం లేదు..బాంబ్ పేల్చిన సూర్య
Advertisement

Suryakumar Yadav: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa )మధ్య టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టి20 సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇందులో మొదటి మ్యాచ్ లో టీమిండియా గెలవగా రెండవ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. గురువారం రోజున చత్తీస్గడ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 51 పరుగులు తేడాతో దారుణంగా ఓడిపోయింది ఇండియన్ టీం. అయితే ఈ ఓటమిపై టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్పందించారు. తమ బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయినట్లు ఒప్పుకున్నారు. అదే సమయంలో గిల్ బ్యాటింగ్ పై కూడా విమర్శలు చేశారు.

Also Read: Nicholas Pooran: నికోలస్ పురాన్ పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. స్టంపింగ్ చేయ‌కుండా డ్రామాలు.. రిటైర్డ్ హర్ట్‌గా ప్లేయర్!

టీమిండియా ఓటమిపై సూర్యకుమార్ యాదవ్ రియాక్ట్

Advertisement

దక్షిణాఫ్రికా ( India vs South Africa, 2nd T20I ) చేతిలో చండీగఢ్ వేదికగా జరిగిన రెండో టి20 మ్యాచ్ లో దారుణంగా టీమిండియా ఓడిపోయింది. అయితే ఈ ఓటమిపై టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్పందించారు. 214 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో తమ బ్యాటింగ్ వైఫల్యం చెందిందని వివరించారు. గిల్ మంచి స్టార్ట్ ఇస్తే బాగుండేది అన్నారు. కానీ అతడు మొదటి మ్యాచ్ తో పాటు రెండవ మ్యాచ్లో కూడా దారుణంగా విఫలమయ్యాడని చురకలు అంటించారు. దీంతో పాటు తన ఫామ్ కూడా ఆందోళనగా ఉందని వివరించారు. మేమిద్దరం రానిస్తే, టీమిండియా గెలిచేది అన్నారు. మూడవ మ్యాచ్ లో కచ్చితంగా గెలుస్తామని స్పష్టం చేశారు. అభిషేక్ శర్మ పైన ఎక్కువగా ఆధారపడకుండా, బ్యాటింగ్ చేసే ప్రయత్నం చేస్తామన్నారు. మూడవ మ్యాచ్ లో బాధ్యత మొత్తం తాను తీసుకొని బ్యాటింగ్ చేస్తానన్నారు. తిల‌క్ వ‌ర్మ బ్యాటింగ్ ఆర్డ‌ర్ పై చ‌ర్చిస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో సూర్యకుమార్ యాదవ్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

తిల‌క్ వ‌ర్మ బ్యాటింగ్ ఆర్డ‌ర్ పై విమ‌ర్శ‌లు

దక్షిణాఫ్రికా తో జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడంపై గౌతమ్ గంభీర్ ను మళ్ళీ టార్గెట్ చేస్తున్నారు అభిమానులు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంతో రెండో టి20 మ్యాచ్ లో ఓడిపోయిందని విమర్శలు వస్తున్నాయి. మూడవ వికెట్ కు తిలక్ వర్మను బ్యాటింగ్ గుర్తించితే నిన్నటి మ్యాచ్ లో విజయం సాధించే వాళ్ళం అని ఫ్యాన్స్ అంటున్నారు. కానీ అతన్ని ఐదవ వికెట్ కు బ్యాటింగ్ పంపి, మ్యాచ్ మొత్తం పోగొట్టారని విమర్శలు చేస్తున్నారు. దినంతటికీ కారణం గౌతం గంభీరంటూ ఫైర్ అవుతున్నారు.

Advertisement

మూడో వికెట్ కు అక్ష‌ర్ పటేల్ ను ఎందుకు దించారని మండిపడుతున్నారు. సూర్య కుమార్ యాదవ్ లేదా తిలక్ వర్మ మూడవ స్థానంలో వస్తే బాగుండేది అంటున్నారు. ఇలా అయితే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ టీమిండియా గెలవడం కష్టమే అని ఫైర్ అవుతున్నారు. కాగా ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లు ఆడి నాలుగు వికెట్ల నష్టపోయి 213 పరుగులు సాధించింది. అటు టీమిండియా 19.1 ఓవర్లు ఆడి, 162 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. దీంతో 51 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై టీమిండియా ఓడిపోయింది.

Also Read: Ind vs SA 2nd T20I: 7 వైడ్లు వేసిన అర్ష‌దీప్‌,54 ప‌రుగులు..గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్‌, టీమిండియా టార్గెట్ ఎంతంటే

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×