Shahid Afridi vs Shaheen Afridi Cold War : పాకిస్తాన్ గడ్డపై వన్డే ట్రై సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 4 మ్యాచ్ లు జరుగగా, అన్ని మ్యాచ్ లూ ఉత్కంఠ భరితంగా సాగాయి. ఇలాంటి నేపథ్యంలోనే మామా అల్లుళ్ల పంచాయితీ తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది, ప్రస్తుతం వన్డే సారధి షాహీన్ అఫ్రిది మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పాకిస్తాన్ వన్డే జట్టులో పలు మార్పులు చేయాలని షాహిద్ అఫ్రిది పలు సూచనలు చేశాడు. వన్డే జట్టులోకి సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) తీసుకుంటే బెటర్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, వాటిని ఆయన అల్లుడు షాహీన్ అఫ్రిది కొట్టిపారేశాడు. అందరి సలహాలు వింటూ పోతే, పాకిస్తాన్ జట్టును ముందుకు తీసుకెళ్లలేమంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో మామ అల్లుళ్ల మధ్య పంచాయితీ షురూ అయినట్టు క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పాకిస్తాన్ వేదికగా ట్రై సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో టీ20 కెప్టెన్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan)ను వన్డే జట్టులోకి తీసుకుంటే మంచి ఫలితాలు వచ్చేవంటూ షాహిద్ అఫ్రిది సూచించాడు. వరుసగా విఫలమౌవుతున్న ఫఖార్ జమాన్, సైమ్ అయూబ్‌లను తొలగించి, వారి స్థానంలోసాహిబ్‌జాదా ఫర్హాన్ ను తీసుకోవాలన్నాడు. ఈ తరుణంలో లాహోర్ వేదికగా మీడియాను అడ్రస్ చేసిన షాహీన్ అఫ్రిది, తన మామ షాహిద్ అఫ్రిది సూచనలను బేఖాతరు చేశారు.
పాకిస్తాన్ వన్డే జట్టులో అందరూ బాగానే ఆడుతున్నారని, ఎవరినీ తొలగించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశాడు. 2027 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని జమాన్, సైమ్‌లను తీసుకున్నామని, వాళ్లు కచ్చితంగా ట్రై సిరీస్‌లో రాణిస్తారని తెలిపారు. సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) టీ20 కెప్టెన్‌గా దూసుకుపోతున్నాడని, అతన్ని వన్డేల్లోకి తీసుకొస్తే పెద్దగా ప్రయోజనం ఉండదని వెల్లడించారు. అతన్ని టీ20ల్లోనే కొనసాగించాలని తెలిపారు. అనవరసరంగా తన జట్టు జోలికి రావొద్దని హెచ్చరించారు. దీంతో షాహీన్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగిన వన్డేలో సైమ్ అయూబ్ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. ఈ తరుణంలోనే సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) తీసుకునే ఆలోచన చేస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే నేపాల్ ప్రీమియర్ లీగ్ నేపథ్యంలో ఖాట్మాండ్ వెళ్లాడు ఫర్హాన్. పీసీబీ నుంచి పిలుపు వస్తే, కచ్చితంగా ఫర్హాన్ తిరిగి వచ్చి, జట్టులో చేరే అవకాశాలున్నాయి.