Bus Accident: బస్సును వెనక్కి తిప్పుతుండగా పాదచారులపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో తొమ్మిది మందికి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అసలేం జరిగింది?
ముంబై సిటీలో ఘోర బస్సు ప్రమాదం
ముంబై సిటీలోని భండూప్ రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి పాదచారులపై బస్సు దూసుకెళ్లింది. ఘోర ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. మరో ఎనిమిది మంది వరకు గాయపడ్డారు. ఈ సంఘటన రాత్రి 10 గంటల సమయంలో భాండప్ వెస్ట్‌లోని రద్దీగా ఉండే స్టేషన్ రోడ్‌లో జరిగింది.
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు అంబులెన్సులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయి. పోలీసు చెబుతున్న వివరాల మేరకు.. నార్మల్‌గా ముంబై సిటీలోని భాందూప్ వెస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది.
పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు, స్పాట్ లో నలుగురు మృతి
విధుల తర్వాత ఇంటికి వెళ్లే కార్మికులు, వ్యాపారులు, సాధారణ పాదచారులు ఫుట్‌పాత్‌పై నడుస్తుంటారు. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్‌కి చెందిన ఓ బస్సు రూట్ ఎండ్ పాయింట్ వద్ద రివర్స్ తీస్తోంది. డ్రైవర్ సంతోష్ రమేష్ సావంత్ బస్సుని వెనక్కి తీస్తుండగా ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయాడు.
వెంటనే బస్సు ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది.బస్సు దాదాపు 13 మందిపై దూసుకెళ్లింది. క్షణాల్లో ఓ వైపు అరుపులు.. మరోవైపు గందరగోళం చోటు చేసుకుంది. బస్సు ఆగే సరికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒలెక్ట్రా సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు.
ALSO READ: తల్లి చనిపోయిన క్షణాల్లో పాప కూడా
గతేడాది డిసెంబర్ 9న ఇలాంటి ఘటన జరిగింది. ఎలక్ట్రిక్ బస్సు బస్సు నియంత్రణ కోల్పోయి పాదచారుల వైపు దూసుకెళ్లింది. ఆ తర్వాత 22 వాహనాలను ఢీ కొట్టింది. బస్సు దాదాపు 200 మీటర్లు దూసుకుంటూ వెళ్లి ఆగిపోయింది. ఈ సంఘటనలో తొమ్మిది మంది మరణించగా, 42 మంది గాయపడ్డారు. తాజాగా ఏడాది కూడా డిసెంబర్‌లో ప్రమాదం జరిగింది.
BEST bus ran over 4-5 people (count unconfirmed) at Bhandup West Station Road area in Mumbai pic.twitter.com/jzoImgpEP2
— Rahul (@rahulrsawant) December 29, 2025