E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు – వారికి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి

Today Horoscope in Telugu: ఆ రాశి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు – వారికి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 5వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

తల్లి తరపు బందు వర్గంతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన మందకోడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించాలి.  వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. 

వృషభం

Advertisement

సోదరులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. 

మిథునం

వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు.  అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. గృహమునకు కొందరి  ప్రవర్తన మానసిక ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కర్కాటకం

Advertisement

నిరుద్యోగుల కష్టం ఫలించిన నూతన అవకాశాలు అందుతాయి. ఇంటా బయట మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులలో  విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో  దైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు.  ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.

సింహం

వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.  ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

కన్య

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. ఋణ సమస్యల  నుండి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.  నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. పాత రుణాలు తీర్చగలుగుతారు. బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.  ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి.

వృశ్చికం

వృత్తి ఉద్యోగాలలో మేలైన సౌకర్యాలను పొందుతారు. సమాజంలో కీర్తి గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం విద్యా విషయాలపై కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు. 

ధనుస్సు

ఇతరులపై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది. బంధు మిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుకున్న సమయానికి పనులు పూర్తికావు.

మకరం

 భూ క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.  ఉద్యోగాలలో  బాధ్యతలను  సమర్థవంతంగా  నిర్వహిస్తారు.

కుంభం

సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట  మీ  మాటకు విలువ  పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలను తీసుకుని ముందుకు సాగడం మంచిది.  ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

మీనం

ధన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×