E-Paper
Advertisement

Saailu Kampati : జూనియర్ ఎన్టీఆర్ కోసమే ఏడు కథలు సిద్ధం చేశా, తారక్ అవకాశం ఇస్తాడా? 

Saailu Kampati : జూనియర్ ఎన్టీఆర్ కోసమే ఏడు కథలు సిద్ధం చేశా, తారక్ అవకాశం ఇస్తాడా? 
Advertisement

Saailu Kampati : ఈ రోజుల్లో ఒక సినిమాతో ప్రూవ్ చేసుకుంటే చాలు తర్వాత ఆటోమేటిక్ గా అవకాశాలు వస్తుంటాయి. అలానే వచ్చిన అవకాశాలు కూడా నిలబెట్టుకోవడం చాలా అవసరం. రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సాయిలు కంపాటి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచే విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది.

వాస్తవానికి ఈ సినిమాకి ముందు రోజే ప్రీమియర్స్ వేశారు. అప్పుడు ప్రీమియర్స్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దాదాపు ఇప్పుడు సినిమా 15 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా దర్శకుడు సాయిలు కంపాటి పలు రకాల ఇంటర్నేషనల్ పాల్గొంటున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు రివీల్ చేశాడు దర్శకుడు సాయిలు కంపాటి.

ఎన్టీఆర్ కోసం ఏడు కథలు 

Advertisement

సాయిలు కంపాటికి చిన్నప్పటినుంచి సినిమాలంటే విపరీతమైన ఆసక్తి ఉండేది. చిన్నప్పుడు మొదట కథలో రాయకుండా టైటిల్స్ రాసుకునే వారంట. ఈ టైటిల్ అయితే ఎన్టీఆర్ కి సరిపోతుంది అని అప్పట్లోనే ఊహించుకొని ఉండేవాళ్ళంట. తాను మొదటి కథను ఆరవ తరగతిలో ఉన్నప్పుడే రాశారు సాయిలు కంపాటి.

ఆరవ తరగతి చదువుతున్న టైంలో భూమిలో నుంచి సుమోలు వచ్చేటట్లు కథల రాశాడట. అయితే ప్రస్తుతం తమ దగ్గర మొత్తం ఏడు కథలు ఉన్నాయంట. ఈ ఏడు కథలు కూడా ఎన్టీఆర్కు సరిగ్గా సరిపోతాయి అని సాయిలు కంపాటి చెప్పాడు. ఎన్టీఆర్ తోనే సినిమా చేయాలి అని డ్రీమ్ సాయిలు కంపాటికి ఉంది అని ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు.

నాన్న మెగాస్టార్ ఫ్యాన్ 

Advertisement

మరోవైపు సాయిలు కంపాటి వాళ్ళ నాన్నకు మెగాస్టార్ చిరంజీవి అంటే విపరీతమైన ఇష్టమంట. అలానే బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలు సాయిలు కంపాటికి ఒక అవకాశం ఇస్తాను అని స్టేజ్ పైన ప్రామిస్ చేశారు. అదే జరిగితే సాయిలు కంపాటి వాళ్ళ నాన్నను చిరంజీవి సెట్ కు తీసుకెళ్తా అని చెప్పారట.

ఇకపోతే సాయిలు కంపాటి ఎన్టీఆర్ తో సినిమా చేస్తే రా అండ్ రెస్టిక్ గా సినిమా చేస్తాను అని చెప్పారు. ఒకవేళ ఇదేగాని నిజమైతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మరో అసలైన దర్శకుడు దొరికాడు అని చెప్పొచ్చు.

Also Read: Peddi: వాయిదా పడ్డ రామ్ చరణ్ పెద్ది? పెద్ద సినిమాలకు తప్పని ఇబ్బందులు

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×