E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారు చేపట్టే పనుల్లో ఆకస్మిక విజయం – రియల్ ఎస్టేట్ వ్యాపారులకు స్వల్ప నష్టాలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారు చేపట్టే పనుల్లో ఆకస్మిక విజయం – రియల్ ఎస్టేట్ వ్యాపారులకు స్వల్ప నష్టాలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 9వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

నూతన గృహాపకరణాలు కొనుగోలుచేస్తారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి  ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు.  వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాల అందుతాయి. 

వృషభం

Advertisement

చేపట్టిన  పనులలో  శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇతరులతో  తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. సంతాన  అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. 

మిథునం

ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. ఇంటా బయట పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనులలో అవరోధాలు అధిగామిస్తారు. వ్యాపారాలు లాభాలబాట పడుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

కర్కాటకం

Advertisement

 దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు అతి కష్టంమీద పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.

సింహం

కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వామితో సఖ్యత కలుగుతుంది. బంధు మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు.  ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

కన్య

ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. అనుకున్న సమయానికి  పనులు  పూర్తి కావు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. భూ సంభందిత క్రయ విక్రయాల అంతంత మాత్రంగా సాగుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

వ్యాపార వ్యవహారాలలో అవాంతరాలు అదిగమించి లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి  ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణదాతల ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృశ్చికం

సమాజంలో ప్రముఖుల  పరిచయాలు ఉత్సాహనిస్తాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగమున మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమునకు ఆప్తుల ఆగమనం ఆనందం  కలిగిస్తుంది. సోదరుల  నుండి కీలక  సమాచారం అందుతుంది.  వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. 

ధనుస్సు

దైవనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభాలబాట పడుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు. నిరుద్యోగుల  ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

మకరం

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన  పనులు వాయిదా వేస్తారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. 

కుంభం

సంతాన విద్యా విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. జీవిత భాగస్వామితో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ఇంటా బయట పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని  నిర్ణయాలు మార్చుకుంటారు.

మీనం

వ్యాపారాలు విస్తరణకు సన్నిహితుల సహాయం అందుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.  జీవిత భాగస్వామితో విభేదాలు కలుగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×