E-Paper
Advertisement

Best Movie in Netflix : బాయ్ ఫ్రెండ్ బెదిరింపులు… దెయ్యం దబాయింపులు… రాత్రయితే గుండెల్లో గుబులు

Best Movie in Netflix : బాయ్ ఫ్రెండ్ బెదిరింపులు… దెయ్యం దబాయింపులు… రాత్రయితే గుండెల్లో గుబులు
Advertisement

Best Movie in Netflix : హారర్ స్టోరీలు ఒకప్పుడు కథల రూపంలో ఇమాజిన్ చేసుకునేవాళ్ళు. కేవలం కార్టూన్ బొమ్మల రూపంలో వీటిని చూసుకునే వాళ్ళు. ఇప్పుడు వస్తున్న విజువల్స్ తో కళ్లముందే దెయ్యాలు ఉన్నాయేమో అన్న ఫీలింగ్ కలుగుతోంది. ప్రతి భాషలో దెయ్యాల సినిమాలను క్రేజీగా చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే థాయ్ సూపర్‌నే చురల్ హారర్ మూవీలో భయపెట్టే సీన్స్ బాగానే ఉన్నాయి. ఒక హోల్ చుట్టూ తిరిగే ఈ కథ ఒంటరిగా చూడటం కష్టమే. గుండెల్లో గుబులు పుట్టించే ఈ సినిమా పేరు ఏమిటి ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

2021లో వచ్చిన ఈ థాయ్ సూపర్‌నే చురల్ మిస్టరీ హారర్ మూవీ పేరు ‘హోల్ ట్రూత్’ దీనికి విసిట్ ససనాటియెంగ్ దర్శకత్వం వహించారు. అభిషేక్ జె. బజాజ్ రచించారు. ఇందులో సోంపోబ్ బెంజతికుల్, సదనోంట్ డురోంగ్‌కవేరోజ్, స్టీవెన్ ఇసారాపాంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2021 డిసెంబర్ 2 న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

పిమ్ అనే 16 ఏళ్ల అమ్మాయికి 15 ఏళ్ల పుట్ అనే తమ్ముడు ఉంటాడు. స్కూల్లో వీళ్ళు, ఇంట్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. వాళ్ల అమ్మ మై ఒక్కసారిగా కారు యాక్సిడెంట్ లో కోమాలో ఉండిపోతుంది. ఇక ఇద్దర్నీ తాత అవ్వ ఇంటికి పంపేస్తారు. ఆ ఇల్లు పాతది, పెద్దది, చుట్టూ అడవి… రాత్రి అయితే గుండెలు గట్టిగానే కొట్టుకుంటాయి. మొదటి రోజు పుట్ గోడలో ఒక చిన్న రంధ్రం చూస్తాడు. “అక్కా ఇటు చూడు” అని పిలిచి కన్ను పెట్టి చూస్తే… అక్కడ వాళ్ల అమ్మ చిన్నప్పుడు ఏదో జరిగిన సీన్ కనిపిస్తుంది. ఇద్దరూ షాక్… ఇదేం మ్యాజిక్ అని భయపడతారు, కానీ మళ్లీ మళ్లీ చూస్తూ ఉంటారు. ఆ రంధ్రం ఫ్యామిలీ దాచిపెట్టిన భయంకరమైన సీక్రెట్స్‌ని చూపిస్తుంది. అందులో ఒక చిన్న పాప ఆత్మ ఉంటుంది. ఆ రంధ్రం వీళ్ళకి ముందు పిన్యా అనే ఒక సిస్టర్ ఉందని తెలుస్తుంది. ఆమె జన్మతః డిసేబిలిటీతో వచ్చింది కాబట్టి అవ్వ ఆమెను ఇష్టపడలేదు.

Read Also : దెయ్యాల కొంపలోకి తింగరి బ్రదర్స్… కామెడీతో కడుపుబ్బా నవ్వించే హారర్ సినిమా

ఒక రోజు పాపకి ర్యాట్ పాయిజన్ కలిపిన పాలు ఇచ్చి చంపేసింది. దీంతో అమ్మ మై తండ్రినే బ్లేమ్ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. తండ్రి గిల్ట్‌తో సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇంట్లో పాలు తాగిన పుట్ క్యాట్ చచ్చిపోతుంది, పుట్ కూడా బ్లడ్ వాంతి చేస్తాడు… అంటే అవ్వ ఇప్పటికీ పాయిజన్ కలుపుతోంది. తాత కూడా ఒక సీక్రెట్ మర్డర్ చేశాడు. మై బాయ్‌ఫ్రెండ్‌ని తప్పుగా అర్థం చేసుకుని చంపేశాడు. ఇవన్నీ ఆ రంధ్రం ద్వారా ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఇంట్లో భయం టాప్ గేర్‌లో ఉంటుంది. చివరికి అమ్మ కోమా నుంచి మెల్లిగా మేల్కొంటుంది, హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తుంది. ఇక క్లైమాక్స్ మరింత భయంకరమైన సన్ని వేశాలతో ముగుస్తుంది. చివరికి ఆ రంధ్రంలో ఉన్న ఆత్మ రివేంజ్ తీర్చుకుంటుందా ? అవ్వా తాతలను శిక్షిస్తుందా ? ఈ హారర్ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
Advertisement

 

 

Related News

మానవాళి మనుగడ కోసం క్రూరమైన రాక్షసులతో వార్… సెన్సేషనల్ యానిమే సిరీస్ తెలుగులో

డాన్ సామ్రాజ్యానికి రాణిగా మారే ఛాన్స్… ఈ క్రైమ్ అండ్ బోల్డ్ డ్రామాలో సస్పెన్స్ పీక్స్

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×