E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – వారు ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్త

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – వారు ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్త
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఫిబ్రవరి 9వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ఆర్థికంగా పురోగతి కలిగి అవసరానికి ధనసహాయం అందుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. 

వృషభం

Advertisement

వృత్తి ఉద్యోగాలలో అధికారులు ఆదరణ పెరుగుతుంది. కొన్ని విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఇంటాబయట వ్యవహారాలు కలిసివస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. 

మిథునం

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

కర్కాటకం

Advertisement

సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.

సింహం

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. చుట్టుపక్కల వారితో అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. 

కన్య

సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి. కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన మానసిక ప్రశాంతత ఉండదు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి ధనం అందుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. నూతన వ్యాపార ప్రారంభానికి మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో సమస్యలను అధిగమించి లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు ఒక వార్త ఆనందం కలిగిస్తుంది.

వృశ్చికం

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులు కలిసి కొన్ని విషయాలు చర్చిస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభానికి శ్రీకారం చుడతారు. కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు చేయడం మంచిది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. 

ధనుస్సు

బంధుమిత్రుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక ఋణాలు ఒత్తిడి కొంతవరకు తొలగుతుంది. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.  

మకరం

మానసికంగా ప్రశాంతంగా ఉంటారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.సోదరుల సహాయంతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. సంతాన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.  

కుంభం

వృత్తి ఉద్యోగాలలో ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. మిత్రులతో వివాదాలను రాజీ చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఋణాలు తీర్చగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.  దైవ చింతన పెరుగుతుంది.

మీనం

 కుటుంబ సభ్యులతో  ఇంట్లో ఆనందంగా గడుపుతారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×