E-Paper
Advertisement

Dallas Islamisation: అమెరికా నగరం పాకిస్తాన్‌లా అనిపిస్తోంది.. ముస్లిం వలసదారులతో నాశనం.. డల్లాస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Dallas Islamisation: అమెరికా నగరం పాకిస్తాన్‌లా అనిపిస్తోంది.. ముస్లిం వలసదారులతో నాశనం.. డల్లాస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
Advertisement

Dallas Islamisation| అమెరికాలో టెక్సాస్ రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ పార్టీకి చెందిన ఒక కాంగ్రెస్‌మెన్ ఇటీవల డల్లాస్ నగరం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డల్లాస్‌లోని కొన్ని ప్రాంతాల్లో “ఇస్లామీకరణ” (ఇస్లాం వ్యాప్తి) జరుగుతోందని ఆయన అన్నారు. అమెరికా వలస వచ్చిన కొందరు తమ దేశాన్ని పాకిస్తాన్‌లా భావిస్తున్నారని ఆయన వాదించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను వివిధ వర్గాలకు చెందిన నాయకులు తీవ్రంగా విమర్శించారు.

కాంగ్రెస్‌మెన్ బ్రాండన్ గిల్ ఏమన్నారు?

బ్రాండన్ గిల్ అనే ఈ కాంగ్రెస్‌మెన్ టెక్సాస్ 26వ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన నియోజకవర్గ ప్రజలు పొరుగు ప్రాంతాల్లో, జీవిన విధానం, సంస్కృతిలో మార్పుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కొత్త మసీదులు నిర్మాణం అవుతున్నాయని. ఆ మసీదులు పక్కనే చాలా కాలంగా ఉన్న అమెరికన్ల కుటుంబ ఆస్తులున్నాయని ఆయన అన్నారు. డల్లాస్ మాల్స్‌లోకి వెళ్తే అంతా ముస్లిం జనాభాతో పాకిస్తాన్‌లో ఉన్నట్లు అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో కూడా “మాస్ ఇస్లామిక్ మైగ్రేషన్ (భారీ సంఖ్యలో ఇతర దేశాల నుంచి వలస వచ్చిన ముస్లింలు) అమెరికాను నాశనం చేస్తున్నారని” అని ఆయన రాశారు.

ముస్లిం సమాజం నుంచి తీవ్ర విమర్శలు

Advertisement

ముస్లిం సమాజ సభ్యులు ఈ వ్యాఖ్యలను హృదయవిదారకంగా ఉన్నాయని, న్యాయ సమ్మతం కాదని అంటున్నారు. అమెరికన్ ముస్లింల పట్ల వివక్ష చూపిస్తున్నాయని, వారిని బయటి వ్యక్తులుగా చిత్రీకరిస్తున్నాయని విమర్శించారు. గతంలో కూడా ఎన్నికల సమయంలో ఆయన ముస్లింలపై అవమానకర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఆయన మాటలు సమాజంలో విద్వేషాన్ని పెంచుతాయని చెప్పారు. పాకిస్తానీ మూలాలున్న ఒక వైద్యుడు సోషల్ మీడియాలో ఈ విషయంపై స్పందిస్తూ.. ఇదే నాయకుడు ఒక కార్యక్రమంలో పాకిస్తానీ సమాజ సభ్యులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారని చెబుతూ ఒక ఫొటో షేర్ చేశారు. దీంతో గిల్ చేసే వ్యాఖ్యలు ఆయన చర్యల మధ్య వైరుధ్యం ఉన్నట్లు ఎత్తి చూపారు. అలాగే ఒక బ్రిటీష్ అమెరికన్ కామెంటేటర్.. బ్రాండన్ గిల్ చాలా హానికరమని.. సమాజంలో భయాందోళనలు కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు.

విస్తృత రాజకీయ నేపథ్యం

బ్రాండన్ గిల్ గతంలో కూడా ఇమ్మిగ్రేషన్, సాంస్కృతిక మార్పులపై బలమైన వ్యాఖ్యలు చేశారు. “రాడికల్ ఇస్లాం (అతివాద ముస్లింలు)” అమెరికాలోకి రావచ్చని హెచ్చరించారు. యూరప్‌లో జరిగిన సమస్యలు అమెరికాలో కూడా రావచ్చని చెప్పారు. ఒక మేయర్ అభ్యర్థి సాంస్కృతిక అలవాట్లను విమర్శిస్తూ “పాశ్చాత్య ఆచారాలు అవలంబించాలి లేదంటే ఆసియా దేశాలకు వెళ్లిపోవాలి” అని కూడా ఆయన అన్నారు.

Advertisement

Also Read: ఇన్వర్టర్ AC vs నాన్-ఇన్వర్టర్ AC.. ఏది కొనాలి? మీ బెడ్‌రూమ్‌కు ఏది బెస్ట్?

విమర్శకుల అభిప్రాయాలు

టెక్సాస్ ఎప్పటి నుంచో విభిన్న సంస్కృతులను ఆహ్వానిస్తున్న రాష్ట్రమని విమర్శకులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో విభేదాలను పెంచుతాయని, ఐక్యతను ప్రోత్సహించాల్సిన రాజకీయ నాయకులు భయాన్ని కలిగించే విధంగా వ్యవహరించ కూడదని చెప్పారు. టెక్సాస్‌లోకి అత్యధికంగా లాటిన్ అమెరికన్ దేశాల నుంచే వలసదారులు వస్తున్నారని.. ఇస్లామీకరణ గురించిన వాదనలకు తగిన డేటా ఆధారం లేదని ఎత్తిచూపారు.

ఈ విషయంపై ఆన్‌లైన్‌లో, స్థానిక చర్చల్లో ఇంకా వివాదం కొనసాగుతోంది. పదవిలో ఉన్నవారు బాధ్యతాయుతంగా మాట్లాడాలని కొందరు రాజకీయ నాయకులు బ్రాండన్ గిల్‌కు సూచించారు. మరికొందరు ప్రజల ఆందోళనలను లేవనెత్తే హక్కు గిల్‌కు ఉందని సమర్థిస్తున్నారు. ఈ చర్చ ఇప్పుడు అమెరికాలో ఇమ్మిగ్రేషన్, సంస్కృతి గురించిన పెద్ద చర్చలో భాగంగా మారింది.

Related News

తగలబడిన పెర్రీ.. ఐదుగురు మృతి, 80 మంది మిస్సింగ్, ఫిలిప్పిన్స్‌‌లో ఘోరం

ప్రపంచ అధినేతల జీతాల లిస్ట్ ఇదే, సింగపూర్ ప్రధాని సాలరీ చూస్తే నోరెళ్లబెడతారు!

అమ్మబాబోయ్.. నూడుల్స్‌లో బతికున్న ఎలుక పిల్ల.. రెస్టారెంట్‌పై కేసు నమోదు!

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. మానవుల మూత్రం వల్ల అతిపెద్ద ముప్పు? పరిశోధనలో కొత్త విషయాలు

మిస్‌‌ వరల్డ్‌‌-2026 పోటీలు.. జోహెరి మెలాకు ప్రపంచ సుందరి కిరీటం, వియత్నాంలో అంగరంగ..

వివాహంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో 22 మంది మృతి, కాంగోలో ఘటన

ఆఫ్రికా పెరిగింది, అమెరికా అలిగింది.. కొత్త ప్రపంచ పటానికి UN ఆమోదం

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

Big Stories

Advertisement
×