E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి వ్యాపారంలో సమస్యలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి వ్యాపారంలో సమస్యలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 12వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ఉద్యోగమున పదోన్నతులు  పెరుగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారస్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి.  నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి ఆశించిన సహాయం అందుతుంది.  చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.

వృషభం

Advertisement

వృత్తి ఉద్యోగాలలో  కీలక సమాచారం అందుతుంది.  నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంబించి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శనాలు చేసుకుంటారు.   దీర్ఘకాలిక ఋణ సమస్యలు పరిష్కరించుకుంటారు. 

మిథునం

వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్థులకు స్థానచలనాలు తప్పవు. ఆకస్మికంగా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన  పనుల్లో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. కుటుంబమున అదనపు బాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి.

కర్కాటకం

Advertisement

ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో అధిక కష్టంతో అల్ప  ఫలితం పొందుతారు. ముఖ్యమైన పనులలో ఆటంకాలుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారమున ఊహించని సమస్యలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలలో మార్గవరోధాలు కలుగుతాయి.

సింహం

ఉద్యోగమున  సమస్యలు తొలగి ఊరట చెందుతారు. సంఘంలో  ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. మిత్రుల నుండి  అరుదైన ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. శుభ కార్యములకు  ధనవ్యయం చేస్తారు. 

కన్య

కుటుంబ వాతావరణం  చికాకు పరుస్తుంది. ధనదాయ మార్గాలకు అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగులకు ఇతరుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధు వర్గంతో మాటపట్టింపులు ఉంటాయి. ఇంటా బయట విమర్శలు అధికమవుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

సమాజంలో ఉద్యోగమున సమస్యలు  అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారమున నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలిస్తాయి.  గౌరవ మర్యాదలకు లోటుండదు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

వృశ్చికం

నూతన రుణ ప్రయత్నాలు కలసిరావు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు  సామాన్యంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన  బాధ్యతలు చేపడతారు.  అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. గృహమున కొందరి ప్రవర్తన వలన శిరోభాధలు తప్పవు. 

ధనుస్సు

వృత్తి వ్యాపారములలో  నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. గృహమున చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.  

మకరం

వ్యాపారమున  ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగస్థుల కలలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఆప్తులు నుంచి ధన సహాయం అందుతుంది. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. చేపట్టిన పనులలో  కార్యజయం కలుగుతుంది.  చిన్ననాటి మిత్రులతో  విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.  

కుంభం

ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. సన్నిహితుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో  చిన్నపాటి  మాటపట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇతరుల  నుండి  ఋణ  ఒత్తిడులు అధికమవుతాయి.

మీనం

వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి.  దాయదులతో స్ధిరాస్తి  ఒప్పందాలు  వాయిదా పడతాయి. ఉద్యోగాలలో  అదనపు    బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. చేపట్టిన పనుల్లో  అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.  ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. 

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×