E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి ప్రేమికులకు అనుకూలమైన రోజు – నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం

Today Horoscope in Telugu: ఆ రాశి ప్రేమికులకు అనుకూలమైన రోజు – నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 17వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. దీర్ఘకాలిక రుణాలు నుండి విముక్తి కలుగుతుంది. ఆప్తులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఉద్యోగమున మీ ప్రతిభ వెలుగులోకి  వస్తుంది. వ్యాపారస్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి.  సంతాన విద్యా ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి.

వృషభం

Advertisement

వృత్తి, వ్యాపారాలలో స్థిర నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఆశించిన సహకారం అందుతుంది. ఉద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనుల్లో స్వంత ఆలోచనలతో ముందుకు సాగుతారు. 

మిథునం

వృత్తి ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. సంతానంతో అకారణ కలహాలు కలుగుతాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. ఋణ ఒత్తిడి వలన శిరోభాధలు తప్పవు. శ్రమాధిక్యతతో దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

కర్కాటకం

Advertisement

కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.  మిత్రులపై మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేరు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాల్లో అధికారుల  ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. వ్యాపారాలు  మందకొడిగా సాగుతాయి.

సింహం

జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ధన పరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.  బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. 

కన్య

దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో  అధికారుల నుండి  ప్రశంసలు అందుకుంటారు. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు  మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. విలువైన వస్తువులు విషయంలో  జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున బాధ్యతలు సరిగా నిర్వహించలేరు. చేపట్టిన పనులు మందగిస్తాయి. కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తాయి.  వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అంతగా కలిసిరావు.

వృశ్చికం

వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన  వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.   కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. 

ధనుస్సు

నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. అన్ని వైపుల నుండి అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులలో  ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలు అందుకుంటారు. ప్రేమికులకు అనుకూలమైన రోజు.  సోదరుల నుండి ఊహించని ధన  సహాయం అందుతాయి.  

మకరం

వృత్తి బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. ఉద్యోగాలలో నిరుత్సాహ  వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది.  ఇతరుల నుండి ఊహించని విమర్శలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.  

కుంభం

సంతానం విద్యా విషయాల సంతృప్తికరంగా సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది.  మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.

మీనం

ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట కొన్ని వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి.  వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కావు. 

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×