E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు – వారికి ఇంట్లో గొడవలు

Today Horoscope in Telugu: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు – వారికి ఇంట్లో గొడవలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 21వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

చిన్ననాటి మిత్రులు నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది. నూతన వాహనం  కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు.  ఉద్యోగస్తులకు పదవులు పెరుగుతాయి.

వృషభం

Advertisement

ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది. వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు సంబంధించి ఆప్తుల  నుండి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతానం విద్యా  ఫలితాలు  సంతృప్తి కలిగిస్తాయి. 

మిథునం

కుటుంబ విషయంలో స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు. బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా వేస్తారు.  వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పదు.

కర్కాటకం

Advertisement

దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి.

సింహం

విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు  నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగార్థులకు ఆశించిన స్థాన చలనాలు కలుగుతాయి. 

కన్య

దీర్ఘకాలిక రుణాలు తీర్చగలరు.  వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ఉద్యోగ వాతాహవరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. స్ధిరాస్తి  కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగ విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. విద్యార్థులు మరింత కష్టపడాలి.

వృశ్చికం

సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు. చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో కాని  పూర్తికావు. కొన్ని వ్యవహారాలలో కావలసిన వారే మోసగిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.  వ్యాపారాలు తీసుకున్న నిర్ణయాలు కలిసిరాక నిరాశ కలిగిస్తాయి. 

ధనుస్సు

భూ సంబంధిత  క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు కలుగుతాయి. నూతన వ్యక్తుల  పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.  

మకరం

చేపట్టిన పనులలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అధిక శ్రమతో అల్ప  ఫలితాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవర పెడతాయి. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు.  

కుంభం

ఆర్థికంగా కొంత ప్రతికూల పరిస్థితులుంటాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో లోపాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.  నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

మీనం

కుటుంబ పెద్దలతో కలహ సూచనలు ఉన్నవి. దూర ప్రయాణాలలో వాహనం ఇబ్బందులు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు కొంత మందకోడిగా  సాగుతాయి. శ్రమతో గాని కొన్ని పనులు పూర్తి కావు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. 

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×