E-Paper
Advertisement

Murder Mystery OTT : లవర్ డెడ్ బాడీ పక్కనే కళ్ళు తెరిచే బిజినెస్ మ్యాన్… మతిపోగొట్టే మర్డర్ మిస్టరీ

Murder Mystery OTT : లవర్ డెడ్ బాడీ పక్కనే కళ్ళు తెరిచే బిజినెస్ మ్యాన్… మతిపోగొట్టే మర్డర్ మిస్టరీ
Advertisement

Murder Mystery OTT : కొన్ని సినిమాలు ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అవుతుంటాయి. వాటిలో వచ్చే ట్విస్టులు ఆడియన్స్ నీ ఫిధా చేస్తుంటాయి. ఈ సినిమాలను వేరే భాషల్లో కూడా రీమేక్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తుంటారు. అలాంటి సినిమా గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ స్పానిష్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది. దీని ఆధారంగా తెలుగులో 2019లో ‘ఎవరు’ (Evaru)సినిమా రూపొందింది. ఇందులో అడివి శేష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సీ పన్నూ నటించిన ‘బద్లా’ (Badla) కూడా దీనికి రీమేక్ గా వచ్చింది. ఈ మూవీ పేరు ఏమిటి? ఏ ఓటీటీలో లో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

2016లో విడుదలైన ఈ స్పానిష్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం పేరు ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ (The invisible guest). దీనికి ఓరియోల్ పాలో దర్శకత్వం వహించారు. ఇందులో బార్బరా లెన్నీ, జోస్ కరోనాడో, అనా వాగెనర్‌లతో పాటు మారియో కాసాస్ నటించారు. ఈ చిత్రం 2017 జనవరి 6 న స్పెయిన్‌లో విడుదలైంది. ఇది విమర్శకుల నుండి ప్రశంసలు పొందింది. చైనా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా జనాదరణను పొందింది. దీని బడ్జెట్ €4 మిలియన్లు కాగా, ప్రపంచవ్యాప్తంగా $31.2 మిలియన్లు వసూలు చేసింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది. ఇది స్పానిష్ భాషలో ఉన్నప్పటికీ, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు. ఇందులో మారియో కాసాస్, అనా వాగెనర్, బార్బరా లెన్నీ, జోస్ కొరోనాడో నటించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అడ్రియన్ డోరియా అనే ఒక పెద్ద వ్యాపారవేత్త, ఒక హోటల్ గదిలో తన ప్రియురాలి లారా శవంతో పాటు పోలీసులకు దొరుకుతాడు. ఆ గది లోపల నుండి గడియ పెట్టి ఉంటుంది. పోలీసులు అడ్రియన్‌ను నిందితుడిగా భావిస్తారు. తాను నిర్దోషినని నిరూపించుకోవడానికి, అతను వర్జీనియా గుడ్‌మాన్ అనే ఒక ప్రముఖ లాయర్‌ను సంప్రదిస్తాడు. అడ్రియన్ చెప్పే దాని ప్రకారం, కొన్ని నెలల క్రితం అతను, లారా కలిసి ఒక కారు లో ప్రయాణం చేస్తుండగా, అడవిలో ఒక చిన్న ప్రమాదం జరుగుతుంది. ఆ కారు ఒక డేనియల్ అనే యువకుడి కారును ఢీకొంటుంది. ఆ ప్రమాదంలో డేనియల్ చనిపోతాడు.

తన కెరీర్ పాడవుతుందనే భయంతో, అడ్రియన్ ఆ యువకుడి మృతదేహాన్ని కారుతో సహా సమీపంలోని ఒక చెరువులో ముంచేస్తాడు. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, లాయర్‌ ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. అడ్రియన్ చెబుతున్న కథలోని లొసుగులను బయటపెడుతుంది. అయితే హోటల్ గదిలో లారాను చంపింది ఎవరో బయట వ్యక్తి అని అడ్రియన్ వాదిస్తాడు. సినిమా చివరి 10 నిమిషాల వరకు అసలు నిజం ఏంటో ఎవరూ ఊహించలేరు. చివరికి లారాని చంపింది ఎవరు ? ఎందుకు చంపారు ? లాయర్‌ బయట పెట్టే నిజలు ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also :  లైవ్ లో దెయ్యాలను చూపిద్దామని వెళ్ళి అడ్డంగా బుక్… వణికించే హర్రర్ సిరీస్

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×