E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారికి నూతన వాహన యోగం

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారికి నూతన వాహన యోగం
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 23వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ఉద్యోగాలలో చికాకులు మరింత పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.  వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. ధనవ్యయ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి.

వృషభం

Advertisement

వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి. నూతన వస్తులాభాలు ఉంటాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి  విలువైన సమాచారం అందుతుంది.  వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. 

మిథునం

నూతన వాహనయోగం ఉన్నది. దైవదర్శనాలు చేసుకుంటారు. విద్యార్థుల అంచనాలు అందుకుంటారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో  సన్నిహితులు, సహాయ సహకారాలు అందుతాయి.  వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా  సాగుతాయి.

కర్కాటకం

Advertisement

చేపట్టిన పనులలో  శ్రమ తప్పదు. గృహమున కొందరి ప్రవర్తన శిరో బాధ కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.  వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

సింహం

మానసిక సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఎంత శ్రమపడిన  పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యమైన పనులలో  వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. 

కన్య

స్థిరాస్తి క్రయ  విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో ఆకస్మికంగా  నిర్ణయాలు మార్చుకుంటారు.  ఉద్యోగమున మీ విలువ మరింత పెరుగుతుంది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా  సాగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ధన పరమైన చికాకులు పెరుగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి.  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృశ్చికం

వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి.  నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. చేపట్టిన  పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. 

ధనుస్సు

చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. మిత్రుల నుంచి ఋణ  ఒత్తిడులు పెరుగుతాయి.  వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి.  

మకరం

దైవచింతన పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.  ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.  

కుంభం

వాహన అనుకూలత కలుగుతుంది. అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. విలువైన వస్త్ర ఆభరణలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

మీనం

వృత్తి ఉద్యోగాలలో శ్రమ తప్పదు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. ఆర్థిక ఇబ్బందులు అధికమౌతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ముఖ్యమైన  వ్యవహారాలు ముందుకు సాగక  నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. 

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×