E-Paper
Advertisement

Sheshippu OTT release date : IFFK 2025లో ప్రశంసలు అందుకున్న మలయాళం మూవీ… మరికొన్ని గంటల్లో డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్

Sheshippu OTT release date : IFFK 2025లో ప్రశంసలు అందుకున్న మలయాళం మూవీ… మరికొన్ని గంటల్లో డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్
Advertisement

Sheshippu OTT release date : ఓటీటీలోకి మరో మలయాళ చిత్రం వచ్చేసింది. ఇది థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. మేకింగ్ స్టైల్ సింపుల్ గా ఉంటుంది. గొప్ప విజువల్స్, స్టార్ నటులు లేకపోయినా, క్యారెక్టర్ ఎమోషన్స్ మీద ఆధారపడి నడిచే కథ ఇది. మలయాళ సినిమా ప్రేమికులు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న ఈ సినిమాని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు కూడా. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం

శ్రీజిత్ ఎస్ కుమార్, గ్రిటో విన్సెంట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పేరు ‘షెషిప్పు’ (Sheshippu). ఈ చిత్రంలో మీనాక్షి జయన్, రషీద్ రెహమాన్ నటించారు. ఈ సినిమాను 30వ అంతర్జాతీయ కేరళ చలనచిత్రోత్సవం (IFFK 2025)లో మలయాళ సినిమా టుడే కేటగిరీకి అధికారికంగా ఎంపిక చేశారు. ఇప్పుడు ‘షెషిప్పు’ (Sheshippu) 2026 జనవరి 23 నుంచి Sun NXTలో డైరెక్ట్ గా రిలీజ్ అవుతోంది ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో. ఫెస్టివల్ స్క్రీనింగ్ మిస్ అయినవాళ్లకు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో మాటలు తక్కువ ఉంటూ, నిశ్శబ్దం ఎక్కువగా మాట్లాడుతుందని చలామంది ఈ సినిమాను కొనియాడారు.

కథ ఏమిటంటే

Advertisement

ఈ కథ ఒక రచయిత (రషీద్ రెహమాన్) చుట్టూ తిరుగుతుంది. అతను సమాజానికి దూరంగా, ఒక ప్రశాంతమైన ఎస్టేట్‌లో ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు అతని ప్రశాంతమైన జీవితంలోకి విక్టోరియా (మీనాక్షి జయన్) అనే మహిళ ఎంట్రీ ఇస్తుంది. ఆమె తన జీవితంలో ఒక బాధాకరమైన సంఘటనను ఎదుర్కొని, దాని నుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక ఈ ఇద్దరు అపరిచితులు ఒకరికొకరు ఎలా తోడుగా నిలిచారు? వీళ్ళ జీవితాలు ఎలా మలుపు తిరిగాయి ? అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా కేవలం మాటల మీద కాకుండా, సైలెంట్ గా ఉండే రెండు పాత్రల ఎమోషన్స్‌పై ఆధారపడి నడుస్తుంది.

Read Also : Action Thriller OTT : 22 అవార్డులను గెలుచుకున్న 2 గంటల 20 నిమిషాల యాక్షన్ డ్రామా… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×