E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ప్రయాణాల్లో లాభాలు – వారికి అనారోగ్య సమస్యలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ప్రయాణాల్లో లాభాలు – వారికి అనారోగ్య సమస్యలు
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన మార్చి 17వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి.  ముఖ్యమైన పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులకు చేయవలసి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి. 

వృషభం

Advertisement

వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. 

మిథునం

స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి. 

కర్కాటకం

Advertisement

శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

సింహం

దైవ సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ఉద్యోగార్థులకు కొంత అనుకూలత వాతావరణం ఉంటుంది. 

కన్య

దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించక పోవడం మంచిది. సోదర స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

వృశ్చికం

వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. 

ధనుస్సు

నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి.  

మకరం

ధన పరంగా ఒడిదుడుకులు అదికమౌతాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన ఋణాలు చెయ్యకపోవడం మంచిది. 

కుంభం

రాజకీయ వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన మార్పులు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు.

మీనం

నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. వ్యాపారాల్లో నూతనప్రణాళికలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమతో పనులు పూర్తి చేస్తారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×