E-Paper
Advertisement

Harish Shankar: హరీష్ శంకర్ నెక్ట్స్ స్టెప్ రాజకీయాలేనా? తెలంగాణ పాలిటిక్స్‌లో ఆసక్తికర చర్చ!

Harish Shankar: హరీష్ శంకర్ నెక్ట్స్ స్టెప్ రాజకీయాలేనా? తెలంగాణ పాలిటిక్స్‌లో ఆసక్తికర చర్చ!
Advertisement

Harish Shankar: హరీష్ శంకర్ నెక్ట్స్ స్టెప్ రాజకీయాలేనా? ఇప్పుడు కొత్తగా తెలంగాణ పాలిటిక్స్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అందుకు కారణం మాత్రం ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ వేడుకే. ఈ వేడుకలో హరీష్ శంకర్‌ని ఉద్దేశిస్తూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీశాయి. ఎక్కడో మారు మూల పల్లెటూరి నుంచి వచ్చి, తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్‌గా చలామణీ అవుతున్న హరీష్ శంకర్‌పై పవన్ కళ్యాణ్ వంటి వారు రాజకీయ ప్రస్తావన తెస్తే కచ్చితంగా చర్చకు దారి తీస్తుంది. ఇప్పుడదే జరుగుతుంది. అసలు ఈ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? నిజంగానే హరీష్ శంకర్ రాజకీయాల్లోకి వస్తారా? అనే విషయానికి వస్తే..

Also Read- Aruna Janasena: చిన్మయి‌కి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కౌంటర్!

తెలంగాణ నేల కోసం పనిచేస్తాడు

Advertisement

ముందుగా పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ‘‘మీలో ఒకడు దర్శకుడైతే అది హరీష్ శంకర్. తెలంగాణ నేల నుంచి వచ్చిన దర్శకుడు. నన్ను ఫ్యాన్స్‌కి ఎలా కావాలో, నన్ను ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటారో తనకు బాగా తెలుసు. అందుకే కావాలని పట్టు పట్టి నాతో ఇవన్నీ చేయించాడు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం హరీష్ శంకర్. తనకి అనవసరమైన గొడవలకు, కాంట్రవర్సీలకు వెళ్లొద్దు, వదిలేయ్.. ఓపికగా ఉండూ అని చెప్తుంటాను. ఎవరైనా ఏదైనా అంటే అస్సలు వదిలిపెట్టడు.. వెంటనే ఇచ్చేస్తాడు. హరీష్ ఏదో ఒకరోజు తెలంగాణ నేల కోసం పనిచేస్తాడు. భారతదేశానికి కూడా పని చేస్తాడు. తను గొప్ప పాండిత్యం ఉన్నవాడు. గొప్ప రచయిత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే రైటర్. హరీష్ శంకర్ ప్లానింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కమిట్మెంట్ ఉన్న వ్యక్తి హరీష్ శంకర్’’ అని చెప్పుకొచ్చారు.

Also Read- Raashi Khanna: ఫస్ట్ సినిమా చేసేటప్పుడే.. ఆ నిర్ణయం తీసుకున్నా! నా కల నిజమైంది

ఛాన్సెస్ ఉన్నాయ్..

Advertisement

అంతే అప్పటి నుంచి తెలంగాణ రాజకీయాల్లోకి హరీష్ శంకర్ రావడం పక్కా.. అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక నెటిజన్లు అయితే ‘ఇలాంటి వాడు పాలిటిక్స్‌‌కి అవసరం’ అనేలా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసేలా ప్లానింగ్ జరుగుతున్నట్లుగా ఈ మధ్య వార్తలు వినిపిస్తున్నాయి. హరీష్ శంకర్‌కి కూడా ఒక సినిమా హిట్టు పడితే.. మళ్లీ హిట్ రావడానికి చాలా టైమ్ పడుతుంది. ఇక సినిమాలు ఎందుకులే అనుకుంటే మాత్రం కచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. మనకెందుకులే, అసలే ఆవేశం ఎక్కువ అనుకుంటే మాత్రం.. వచ్చిన సినిమా డైరెక్ట్ చేసుకుంటూ.. మధ్యమధ్యలో నిర్మాతగా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గట్టిగా రావాలని కోరితే మాత్రం.. తెలంగాణ రాజకీయాల్లో హరీష్ ఎంట్రీ ఉండొచ్చు. చూద్దాం.. భవిష్యత్‌లో ఎలాంటి మార్పులు జరుగుతాయో?

Also Read- Harish Shankar: బావా, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రమ్మంటే.. థమన్ సంస్కారానికి హరీష్ ఫిదా!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×