E-Paper
Advertisement

Romantic Drama OTT: ప్రియురాలి దెబ్బకు బిత్తరపోయే ప్రియుడు… క్రాక్ ఎక్కించే క్రేజీ లవ్ స్టోరీ

Romantic Drama OTT: ప్రియురాలి దెబ్బకు బిత్తరపోయే ప్రియుడు… క్రాక్ ఎక్కించే క్రేజీ లవ్ స్టోరీ
Advertisement

Romantic Drama OTT : డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో ఎన్నో ప్రేమ కథలు వస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని మాత్రం మైండ్లో గట్టిగా నిలిచిపోతుంటాయి. ఆ సినిమా స్టోరీ అంతలా ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒక సినిమా గురించి చెప్పుకోవాల్సిందే. ఈ ప్రేమ కథ చాలా డిఫరెంట్ గానే ఉంటుంది. ఒక సాధారణ అమ్మాయి, ఓ రేంజ్ లో నష్టాల్లో ఉన్న కంపెనీని గాడిలో పెట్టడానికి వస్తుంది. ఈ క్రమంలో నడిచే లవ్ స్టోరీ క్రాక్ ఎక్కిస్తుంది.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ ఫిలిప్పీన్స్ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు “ఇట్ టేక్స్ ఏ మ్యాన్ అండ్ ఏ ఉమెన్” (It Takes a Man and a Woman). ఇందులో జాన్ లాయిడ్ క్రజ్ (మిగ్గీ), సారా గెరోనిమో (లైడా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ‘ఎ వెరీ స్పెషల్ లవ్’ (2008), ‘యు చేంజ్డ్ మై లైఫ్’ (2009)సినిమాలకు సీక్వెల్ గా వచ్చింది. ఈ సినిమా ఫిలిప్పీన్స్ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇది దాదాపు 400 మిలియన్ పెసోలు వసూలు చేసి, ఆ సంవత్సరానికి అతిపెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంటే ఇండియన్ కరెన్సీలో 40 కోట్లకు పైమాటే. ఇక ఈ చిత్రానికి గానూ ప్రధాన నటులు సారా గెరోనిమో, జాన్ లాయిడ్ క్రజ్ లు 2014 గోల్డెన్ స్క్రీన్ అవార్డ్స్‌లో ఉత్తమ నటి, ఉత్తమ నటుడు అవార్డులను గెలుచుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథలో హీరో మిగ్గీ ఒక పెద్ద రిచ్ కిడ్. ఇక హీరోయిన్ లైడా ఏమో మన పక్కింటి అమ్మాయిలా చాలా సాఫ్ట్. వీళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోతారు. కానీ ఒక టైమ్‌లో వీళ్ల మధ్య గొడవలు వచ్చి, మిగ్గీ చేసిన ఒక తప్పు వల్ల లైడా మనసు ముక్కలైపోతుంది. ఇక ఇక్కడ ఉండలేక తను అమెరికా చెక్కేస్తుంది. అక్కడ తన స్టైల్, ఆటిట్యూడ్ మొత్తం మార్చుకుని ఒక ఫైర్ బ్రాండ్ లాగా తయారవుతుంది. కొన్ని ఏళ్ల తర్వాత లైడా ఫిలిప్పీన్స్ కి రిటర్న్ వస్తుంది. కట్ చేస్తే, తన పాత ప్రియుడు మిగ్గీ కంపెనీ నష్టాల్లో ఉంటుంది. ఆ కంపెనీని గట్టెక్కించడానికి లైడానే దిక్కు అవుతుంది.

అప్పట్లో అమాయకంగా ఉన్న లైడాను చూసిన మిగ్గీకి, ఇప్పుడు గిల్లితే గీత పడేలా ఉన్న ఈ కొత్త లైడాని చూసి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇద్దరూ ఒకే ఆఫీసులో పని చేస్తూ ఒకరినొకరు కీచులాడుకుంటూ, పాత పగలు తీర్చుకుంటూ నానా రచ్చ చేస్తారు. అయితే తిట్టుకున్నా, కొట్టుకున్నా లోపల మాత్రం పాత ప్రేమ అట్టాగే ఉంటుంది. మిగ్గీ అప్పట్లో ఎందుకు తప్పు చేశాడో, లైడా ఎంత బాధపడిందో ఒకరికొకరు చెప్పుకుంటారు. చివరికి వీళ్ళ ప్రేమ మళ్లీ పట్టాలు ఎక్కుతుందా ? అసలు మిగ్గీ చేసిన మిస్టేక్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : భయం పుట్టించే కిల్లర్ హత్యలు… ఉత్కంఠ రేపే ఇన్వెస్టిగేషన్ … చెమటలు పట్టిస్తున్న ఒక్కో ఎపిసోడ్

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×