E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వ్యాపారస్తులకు ఊహించని సమస్యలు – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: ఆ రాశి వ్యాపారస్తులకు ఊహించని సమస్యలు – ఉద్యోగులకు శుభవార్తలు
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన మార్చి 19వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పితృ వర్గం వారి నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 

వృషభం

Advertisement

బంధు మిత్రులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. దూరప్రయాణాలు కుటుంబ వాతావరణం గందరగోళంగ ఉంటుంది. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. 

మిథునం

సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అందవు. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలం అవుతాయి. 

కర్కాటకం

Advertisement

సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలసి వస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి పెరుగుతాయి.

సింహం

సమాజంలో గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. 

కన్య

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారపరంగా ఊహించని సమస్యలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. సోదరులకు స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు కలసివస్తాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

వృశ్చికం

గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు. 

ధనుస్సు

ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. గృహమున సంతాన వివాహా ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.  

మకరం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు తప్పవు. 

కుంభం

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం

దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కొన్ని వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రులతో వివాదాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.  వ్యాపారములు అంతగా రాణించవు. వృత్తి ఉద్యోగాల్లో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×