E-Paper
Advertisement

Thriller Movie OTT : కళ్ళముందే ప్రియుడి హత్య…హంతకుల గుండెల్లో నిద్రపోయే ప్రియురాలు… మెంటలెక్కిపోయే మలుపులు

Thriller Movie OTT : కళ్ళముందే ప్రియుడి హత్య…హంతకుల గుండెల్లో నిద్రపోయే ప్రియురాలు… మెంటలెక్కిపోయే మలుపులు
Advertisement

Thriller Movie OTT : ఒక మంచి రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటే, ఇప్పుడు మనం చెప్పబోయే మూవీని చూసేయొచ్చు. ఈ సినిమా ప్రేమ కథతో పాటు, ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ రష్యన్ మూవీ, ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా మాత్రం క్లైమాక్స్ వరకు కుర్చీలో నుంచి అస్సలు కదలనివ్వదు.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ రష్యన్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ప్యూర్ ఆర్ట్’ (Pure Art) . దీనిని రష్యన్ భాషలో “Chistoe iskusstvo” అని కూడా పిలుస్తారు. రెనాట్ దావ్లేత్యారోవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అన్నా చిపోవ్స్కాయ, ప్యోటర్ ఫ్యోడోరోవ్ లీడ్ రోల్స్ లో నటించారు. 2016 జూన్ 10న వచ్చిన ఈ సినిమా 2016లో రష్యన్ ఫిల్మ్ వీక్ (పారిస్), హోన్‌ఫ్లూర్ రష్యన్ ఫిల్మ్ ఫెస్టివల్, మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ వంటి పలు ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడింది. 93 నిమిషాల రన్ టైమ్ తో ఈ సినిమా ఐయండిబిలో 5.8 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా prime video, Mubi ఓటీటీలలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సాషా అనే ఒక అందమైన అమ్మాయి ఫోటోగ్రాఫర్ గా లైఫ్ లీడ్ చేస్తుంటుంది. అయితే ఆమె ఒక ప్రతిభ ఉన్న పెయింటర్‌తో ప్రేమలో ఉంటుంది. వాళ్ళ జీవితం చాలా అందంగా సాగిపోతున్న సమయంలో, ఒకరోజు సాషా తన ప్రియుడు దారుణంగా హత్యకు గురవడాన్ని చూసి షాక్ అయిపోతుంది. ఆ సంఘటన ఆమె జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తుంది. అయితే పోలీసులు సాషానే నిందితురాలిగా భావిస్తారు. మరోవైపు అసలు హంతకులు ఆమెను కూడా మట్టుపెట్టాలని వెంటాడుతుంటారు. అటు పోలీసులు, ఇటు ఎవడో తెలియని రౌడీలు సాషా వెనకాల పడతారు. పాపం ఆ పిల్లకు ఏం చేయాలో అర్థం కాక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఊరంతా పరుగెడుతుంది. ఎవడు దోస్తో, ఎవడు శత్రువో తెలియక పిచ్చెక్కిపోతుంటుంది. చివరికి సాషా తన తెలివితేటలతో అసలు విషయం కనిపెడుతుంది. తన ప్రియుడు గీసిన పెయింటింగ్స్ వెనుక పెద్ద దందాయే జరుగుతుంది. కోట్లు సంపాదించడం కోసం పెద్ద పెద్ద మనుషులు ఆడే నాటకంలో ఆమె ప్రియుడు బలైపోయాడని తెలుసుకుని బిత్తరపోతుంది. చివరికి ఆమె ఆ గండం నుంచి ఎట్లా బయటపడింది ? ఆ హంతకులపై ఎట్లా రివేంజ్ తీర్చుకుంది ? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Read Also : 2 గంటల 21 నిమిషాల ఉత్కంఠ… ‘ధురందర్’ ను మరిపించే స్పై థ్రిల్లర్… ఆస్కార్ ను గెలిచిన సినిమా

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×