E-Paper
Advertisement

Eyes Safety tips: హోలీ తర్వాత కళ్లు మండడం, ఎర్రదనం, దురద వస్తున్నాయా? ఈ పని చేయండి

Eyes Safety tips: హోలీ తర్వాత కళ్లు మండడం, ఎర్రదనం, దురద వస్తున్నాయా? ఈ పని చేయండి
Advertisement

హోలీ పండగ అంటే రంగుల సందడి. కానీ ఆనందంగా హోలీ ఆడిన తర్వాత చాలా మందికి కళ్లలో ఎర్రదనం, మంట, దురద, నీళ్లు కారడం వంటి సమస్యలు వస్తాయి. వైద్యుల ప్రకారం హోలీలో ఉపయోగించే రంగుల్లో రసాయనాలు, ధూళి కణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కళ్లలోకి వెళ్లినప్పుడు చికాకు కలుగుతుంది. ముఖ్యంగా పొడి రంగులు గాలిలో ఎగిరి కళ్లలో పడటం వల్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. కొంతమంది రంగు పడిన వెంటనే కళ్లను గట్టిగా రుద్దేస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఇలా రుద్దితే కంటి పై పొర (కార్నియా) గాయపడే అవకాశం ఉంది.

ఈ లక్షణాలతో జాగ్రత్త
హోలీ ఆడాక మీలో కొన్ని లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలి. కళ్లలో ఎర్రదనం, మంట, దురద, నీళ్లు కారడం, కాంతిని చూడలేకపోవడం, చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకూడదు. ఇవి మరీ బాధించకపోతే ఇంట్లోనే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఎక్కువ కాలం పాటూ తీవ్రంగా బాధపెడితే మాత్రం వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

Advertisement

Also read: Holi Colours: ముఖంపై హోలీ రంగులు వదలడం లేదా? కలబంద జెల్ ఇలా వాడండి

రంగు కళ్లలో పడితే శుభ్రమైన నీటితో కళ్లను కడగాలి. కనీసం 10–15 నిమిషాలు నెమ్మదిగా నీరు పోసుకుంటూ కడగాలి. కళ్లను రుద్దకూడదు. రుద్దితే గాయం అయ్యే ప్రమాదం ఉంది. కాంటాక్ట్ లెన్స్‌లు వాడకండి. కళ్లలో మంట ఎక్కువగా ఉంటే, డాక్టర్ సూచించిన ఐ డ్రాప్స్ మాత్రమే వాడాలి. స్వయంగా మెడిసిన్ వాడకండి. కళ్లలో తీవ్రమైన నొప్పి, చూపు మసకబారడం, ఎక్కువ ఎర్రదనం లేదా 24 గంటల తర్వాత కూడా మంట తగ్గకపోతే వెంటనే కంటి నిపుణుడిని సంప్రదించాలి. చిన్న సమస్య అనుకుని వదిలేస్తే పెద్ద ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది.

Advertisement

Also read: Garlic Karam Dosa: నోరూరించే వెల్లుల్లి కారం దోశె రెసిపీ, కొబ్బరిచట్నీతో తింటే స్వర్గం కనిపిస్తుంది

హోలీ ఆనందంగా నిర్వహించుకోవాలి కానీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న జాగ్రత్తలతోనే కళ్లను సురక్షితంగా కాపాడుకోవచ్చు. కళ్లలో ఎలాంటి అసౌకర్యం కనిపించినా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×