E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (12/11/2025) ఆ రాశి వారికి  ధనలాభం – వారికి వృత్తి వ్యాపారాలలో లాభాలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (12/11/2025) ఆ రాశి వారికి  ధనలాభం – వారికి వృత్తి వ్యాపారాలలో లాభాలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన నవంబర్‌ 12వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేష రాశి:  

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలకు మందకోడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

వృషభ రాశి:

Advertisement

వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. మానసిక ఆందోళనతో కొంత చికాకు పరుస్తాయి. స్థిరాస్థి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.  ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

మిథున రాశి:  

ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సోదరుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు  పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు  చేస్తారు. చిన్ననాటి మిత్రుల తో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటక రాశి:

Advertisement

అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.  కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొందరు ప్రవర్తన వలన మానసిక ఆందోళనలు తప్పవు. నేత్ర సంబంధిత అనారోగ్యాలను కొంత బాధిస్తాయి.

సింహరాశి:

మానసికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంతాన వివాహ విషయమై గృహమున ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.

కన్యారాశి :

మీ ఆలోచనలు ఇతరులకు  నచ్చే విధంగా ఉండవు. నిరుద్యోగ  ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.  ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.  దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. నూతన రుణ ప్రయత్నాలు కలసి రావు.  కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

ఇతరులకు  సైతం సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. దూరప్రాంత బంధుమిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు.

వృశ్చికరాశి:

వృత్తి వ్యాపారంలో విశేషలాభాన్ని ఆర్జిస్తారు.  బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక వ్యవహారానికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్త్రా భరణాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలలో  నూతన పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు.

ధనస్సు రాశి:

ఇంటా బయట విలువ మరింత పెరుగుతుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని విషయాలను ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. దైవానుగ్రహం తో కొన్ని పనులు పూర్తవుతాయి.

మకరరాశి:

బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు  అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.  కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

కుంభరాశి:

ఆర్థిక పరిస్థితి  మరింత నిరుత్సాహపరుస్తుంది.  వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సోదరులతో వివాదాలకు  దూరంగా ఉండటం  మంచిని. స్వల్ప అనారోగ్య సమస్యను ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు.

మీనరాశి:

సమాజంలో  పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. రుణబాధలు నుండి ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. స్త్రీ సంబంధిత ధన లాభ సూచనలు ఉన్నవి.

 ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×