E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (01/11/2025) ఆ రాశి వారికి  అకస్మిక ధనలాభం – నిరుద్యోగులకు శుభవార్తలు 

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (01/11/2025) ఆ రాశి వారికి  అకస్మిక ధనలాభం – నిరుద్యోగులకు శుభవార్తలు 
Advertisement

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన నవంబర్‌ 01వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:  

ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమై నూతన  రుణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.  పుణ్యక్షేత్రాలు  సందర్శిస్తారు.

వృషభ రాశి:

Advertisement

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు రావలసిన పదోన్నతుల పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో  శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

మిథున రాశి:  

ఉద్యోగాలలో అనుకూల వాతావరణంఉంటుంది. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల సలహాలు కలసివస్తాయి.  వ్యాపారాలు అనుకులిస్తాయి.

కర్కాటక రాశి:

Advertisement

స్థిరాస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపార విషయంలో జాగ్రత్త అవసరం.

సింహరాశి:

వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. సోదరులు కొన్ని విషయాలలో మీతో విబేదిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి.

కన్యారాశి :

స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. నూతన కార్యకమాలు చేపడతారు. దూరపు బంధువుల కలయిక ఉత్సాహనిస్తుంది. వృత్తి వ్యాపారములలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆకస్మిక వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధు వర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు తీరతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన భూ, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

వృశ్చికరాశి:

మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.  ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

ధనస్సు రాశి:

కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. గృహమున కొందరి ప్రవర్తన శిరో భాధలు కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

మకరరాశి:

ఆత్మీయుల నుంచి వివాదాలకు సంభందించి కీలక సమాచారం. సన్నిహితుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చిన్న నాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.

కుంభరాశి:

వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. కొత్త రుణాలు చేస్తారు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆప్తులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో  ఆలోచనలు స్థిరంగా ఉండవు.

మీనరాశి:

ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో రావలసిన ప్రమోషన్లు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×