E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (29/11/2025) ఆ రాశి ఉద్యోగులకు ఊహించని మార్పులు – బంధువులతో విబేధాలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (29/11/2025) ఆ రాశి ఉద్యోగులకు ఊహించని మార్పులు – బంధువులతో విబేధాలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన నవంబర్‌ 29వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరుల నుండి సమస్యలు తప్పవు. నూతన ఋణాలు చేస్తారు. వృధా ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి.

వృషభం

Advertisement

విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్న నాటి మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. అన్ని రంగాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది.  వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. 

మిథునం

 

Advertisement

వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృథా ఖర్చులు చేదాటుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు పరుస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

కర్కాటకం

వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఇంటా బయట నూతన పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి.  స్నేహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

సింహం

 కుటుంబ సభ్యులతో శుభ కార్యాలలో పాల్గొంటారు. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.

కన్య

 ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సోదరులతో ఒక వ్యవహారంలో సఖ్యత లోపిస్తుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

 వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఉద్యోగస్తులకు నిరుత్సాహం తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన కార్యక్రమాలు  నిరాశ కలిగిస్తాయి. పనులలో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. అందరిలోనూ గుర్తింపు పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సఖ్యత కలుగుతుంది. లాభాల బాటలో సాగుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది.

ధనుస్సు

వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అందరిలోనూ పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమౌతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి.

మకరం

వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నవి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. స్నేహితులతో విభేదాలు కొంత చికాకు పరుస్తాయి. వృధా ఖర్చులు విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది.

కుంభం

దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

మీనం

బంధువులతో విభేదాలు కొంత బాధిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. సంతానం వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు తప్పవు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×