Train Coaches Colours: భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ ను కలిగి ఉంది. ప్రతిరోజూ లక్షలాది రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. అయితే, ఒక్కోరైలు ఒక్కో రంగు కోచ్ లను కలిగి ఉంటుంది. కొన్ని రైళ్లు నీలం రంగు, మరికొన్ని రైళ్లు ఎరుపు రంగు, ఇంకొన్ని రైళ్లు ఆకుపచ్చ, మిగతావి గోధుమ రంగు కోచ్ లతో వస్తాయి. ఇంతకీ ఈ రంగుల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఏ రంగు.. ఏ విషయాన్ని వెల్లడిస్తుందంటే.?
రైళ్లలోని ఒక్కో రంగు కోచ్ కు ఒక్కో అర్థం ఉంది. నీలిరంగు కోచ్ లు సాధారణంగా ICF డిజైన్‌కు చెందినవి. స్లీపర్, AC 2-టైర్, 3-టైర్, చైర్ కార్ కోసం ఉపయోగించబడతాయి. 70–140 కి.మీ. వేగంతో నడుస్తాయి. విశ్వభారతి ఎక్స్‌ప్రెస్ బూడిద రంగు షేడింగ్ తో నీలం రంగు LHB కోచ్‌లను ఉపయోగిస్తుంది. తరచుగా ప్రీమియం సేవలు, ప్రామాణిక ప్రయాణ సౌకర్యం కోసం వీటిని ఉపయోగిస్తారు.
ఎరుపు కోచ్‌లు ఆధునిక LHB రకానికి చెందినవి. మొదట వీటిని జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఇప్పుడు భారత్ లోనే తయారు చేస్తున్నారు. వీటిని రాజధాని, గతిమాన్ రైళ్లలో ఉపయోగిస్తారు. ఎక్కువగా AC తరగతుల కోసం ఉపయోగిస్తున్నారు. తేలికైన పదార్థాలతో నిర్మించబడిన ఈ కోచ్ లు ఏకంగా గంటకు 200 కి.మీ వేగాన్ని అందుకుంటున్నాయి. .
ఆకుపచ్చ కోచ్‌లు గరీబ్ రథ్ రైళ్లకు ఉంటాయి. సరసమైన AC ప్రయాణాన్ని అందిస్తాయి. ఆకుపచ్చ రంగు కోచ్ లు తక్కువ ధరకు మంచి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయని అర్థం. స్వల్ప దూర మార్గాలకు ఉపయోగించే పాత ICF కోచ్‌లలో గోధుమ రంగులో కనిపిస్తాయి. కోచ్ లోని మొదటి రెండు అంకెలు దాని తయారీ సంవత్సరాన్ని సూచిస్తాయి.
Read Also: అమృత్ భారత్ రైళ్లలోనూ ఏసీ కోచ్ లు, రైల్వే కీలక నిర్ణయం!
ఇక గీతలు కోచ్ రకాలను వెల్లడిస్తాయి. పసుపు, తెలుపు గీతలె రిజర్వ్ చేయని కోచ్‌లను సూచిస్తాయి. EMU, MEMUలో ఎరుపు రంగు గీతలు ఫస్ట్ క్లాస్‌ను చూపిస్తాయి. ఆకుపచ్చ చారలు మహిళా కోచ్‌లను సూచిస్తాయి. ఎల్లో గీతలు 155 కిలో మీటర్ల కంటే ఎక్కువ వేగంతో నడిచే రైళ్లను సూచిస్తాయి.
అక్షరాస్యత తక్కువగా ఉన్నప్పుడు ఈ కలర్ కోడ్స్ ను ప్రవేశపెట్టారు. ప్రయాణీకులు కోచ్‌లను సులభంగా గుర్తించడంలో సహాయపడతారు. ఈ రంగులు ఇప్పటికీ యాక్సెసిబిలిటీని మెరుగుపరుస్తాయి. వందే భారత్‌కు ముందు, చాలా భారతీయ రైళ్లు ఒకేలా కనిపించాయి. ఈ ఆధునిక రైళ్లు చక్కటి రంగు, మెట్రో లాంటి డిజైన్ ను తీసుకువచ్చాయి. అధిక వేగం, అత్యాధునిక సౌకర్యాలను అందిస్తుంది. వందేభారత్ రైళ్లకు కూడా త్వరలో సరికొత్త రంగులు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఏ రంగుల్లో వస్తాయనేది త్వరలో కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది.
Read Also: రైళ్లలో ఆ ఫుడ్ సరఫరా చేస్తున్నారా? మానవ హక్కుల సంఘం నోటీసులపై రైల్వే రిప్లై ఇదే!