ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన నవంబర్ 03వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. పాతమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.
ఇంట్లో బంధు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
నూతన వాహనయోగం ఉన్నది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహనిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.
కుటుంబ వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. బంధువులతో ఆకస్మిక తగాదాలు ఉంటాయి.
ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. కుటుంబ సమస్యల వలన మానసిక ప్రశాంతత ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు.
చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఆప్తుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఇంటా బయట అనుకూల వాతావరణ ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు.
ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది.
పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు.
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి.
దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.