BigTV English
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (30/10/2025) ఆ రాశి వారికి అకస్మిక ప్రయాణాలు – పాత బాకీలు వసూలవుతాయి

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (30/10/2025) ఆ రాశి వారికి అకస్మిక ప్రయాణాలు – పాత బాకీలు వసూలవుతాయి

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన అక్టోబర్‌ 30వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:  

దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభ రాశి:

విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. వివాదాలకు సంభందించి విలువైన సమాచారం అందుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. విందువినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.


మిథున రాశి:  

ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిత్రులతో అకారణ మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు తప్పవు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబసభ్యుల నుంచి ధనపరమైన ఒత్తిడి తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటక రాశి:

వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేదాటుతాయి. ఉద్యోగయత్నాలు ముందుకు సాగతాయి. ఇంటాబయట బాధ్యతలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.

సింహరాశి:

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో కీలక వ్యవహారాలలో చర్చలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

కన్యారాశి :

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగ యత్నాలు సానుకూలమౌతాయి.ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు.

వృశ్చికరాశి:

చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. బంధువుల మాటలు మానసికంగా బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు అధికమౌతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి.

ధనస్సు రాశి:

కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహనయోగం ఉన్నది. పాతబాకీలు వసూలవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

మకరరాశి:

కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. సంతాన విద్యా, ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభరాశి:

ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో సమస్యలు అదిగమిస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్ట సుఖాలు పంచుకుంటారు. బంధు వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

మీనరాశి:

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన పనులలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. కొన్ని పనులలో శ్రమ పడినా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (29/10/2025) ఆ రాశి వారికి వ్యాపారంలో నష్టాలు – ఉద్యోగులకు ప్రమోషన్లు 

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (28/10/2025) ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – రాజకీయ ప్రముఖులతో పరిచయాలు  

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (27/10/2025) ఆ రాశి వారికి శుభవార్తలు – కొత్త వ్యక్తుల పరిచయాలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (26/10/2025) ఆ రాశి వారు విలువైన వస్తు, వాహనాలు కొంటారు – వారి మాటకు విలువ పెరుగుతుంది 

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (అక్టోబర్‌ 26 – నవంబర్‌ 01) మిత్రులతో అకారణ వివాదాలు – ఉద్యోగులకు ఆఫీసులో చికాకులు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (25/10/2025) ఆ రాశి వారికి వ్యాపారాల్లో లాభాలు – చేపట్టిన పనుల్లో విజయాలు 

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (23/10/2025) ఆ రాశి వారికి శుభవార్తలు –  వారికి ఊహించని సమస్యలు  

Big Stories

×