BigTV English
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (31/10/2025) ఆ రాశి వారికి వ్యాపారంలో నష్టాలు – వారికి బంధువులతో గొడవలు  

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (31/10/2025) ఆ రాశి వారికి వ్యాపారంలో నష్టాలు – వారికి బంధువులతో గొడవలు  

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన అక్టోబర్‌ 31వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:  

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగులకు ఊహించని స్థానచలన మార్పులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమవుతుంది. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు వస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

వృషభ రాశి:

నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు.


మిథున రాశి:  

వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలసి వస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి:

చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహరాశి:

కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యయ ప్రయాసలతో కొన్ని పనులు పూర్తి కావు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

కన్యారాశి :

ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

సమాజంలో ప్రత్యేక గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులు ఆశించిన పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

వృశ్చికరాశి:

కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. వృత్తి, ఉద్యోగాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు మందగిస్తాయి.

ధనస్సు రాశి:

బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. ఉద్యోగ స్థానచలన సూచనలున్నాయి. వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

మకరరాశి:

చిన్న నాయుడు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.

కుంభరాశి:

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. చేపట్టిన పనులలో కొంత జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో సమస్యలు తప్పవు. బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. ధన పరంగా ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగమున అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది.

మీనరాశి:

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగమున మీ పనితీరుతో అధికారులను సైతం ఆకట్టుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాల్లో అంచనాలు నిజం కాగలవు. పనులు చకచకా పూర్తి చేస్తారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Palmistry: అరచేతుల్లో ఈ మూడు గుర్తులు ఉంటే చాలు, జీవితంలో డబ్బుకు లోటే ఉండదు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (30/10/2025) ఆ రాశి వారికి అకస్మిక ప్రయాణాలు – పాత బాకీలు వసూలవుతాయి

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (29/10/2025) ఆ రాశి వారికి వ్యాపారంలో నష్టాలు – ఉద్యోగులకు ప్రమోషన్లు 

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (28/10/2025) ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – రాజకీయ ప్రముఖులతో పరిచయాలు  

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (27/10/2025) ఆ రాశి వారికి శుభవార్తలు – కొత్త వ్యక్తుల పరిచయాలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (26/10/2025) ఆ రాశి వారు విలువైన వస్తు, వాహనాలు కొంటారు – వారి మాటకు విలువ పెరుగుతుంది 

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (అక్టోబర్‌ 26 – నవంబర్‌ 01) మిత్రులతో అకారణ వివాదాలు – ఉద్యోగులకు ఆఫీసులో చికాకులు

Big Stories

×