Chevella Road Accident: రోడ్డు ప్రమాదాల గురించి పేరు ఎత్తితేచాలు ఒళ్లు జలదరిస్తుంది. ప్రత్యక్షంగా చూసినవాళ్లు కొందరైతే.. ఆ నరకం అనుభవించినవాళ్లు మరి కొందరు. చేవెళ్లలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృత్యువాతపడ్డారు. అత్తవారింటికి పంపాల్సిన వారిని విధి వక్రీకరించింది.
చేవెళ్ల బస్సు ప్రమాదంలో కొత్త కొత్త విషయాలు
తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ ఫ్యామిలీ గురించి చెప్పనక్కర్లేదు. ఆయనకు నలుగురు కూతుళ్లు ఉన్నారు. వృత్తి రీత్యా ఎల్లయ్య డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పెద్ద కూతురు వివాహం చేశారు. మిగతా ముగ్గురు నందిని, సాయిప్రియ, తనూషలు. వారి చూసి తమకు అలాంటి కూతుళ్లు ఉంటే బాగుండేదని ఆ ఊళ్లో వారు అనుకునేవారు. కూతుళ్లని ఆ తండ్రి వెనక్కి తగ్గలేదు.
మాకు కొడుకైనా.. కూతుళ్లయినా ఆ ముగ్గురేనని సమయం, సందర్భం వచ్చినప్పుడు చెప్పేవాడు. వారిని చూసి మురిసిపోయేవాడు. సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఆర్టీసీ బస్సు- టిప్పర్ లారీ ఢీ కొన్న ఘోర ప్రమాదంలో ఆయన ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. స్పాటులో వారంతా మృత్యువాత పడ్డారు. దీంతో ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. తల్లిదండ్రులకు తీరని శోకం, అంతులేని ఆవేదన.
మృతి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు
రెండో కూతురు తనూష ఎంబీఏ చదువుతోంది. మూడో కూతురు సాయిప్రియ డిగ్రీ థర్డ్ ఇయర్ కాగా, చివరి కూతురు నందిని డగ్రీ ఫస్టయిర్ హైదరాబాద్‌లో చదువుతున్నారు. ఇటీవల బంధువుల పెళ్లి ఉండటంతో సొంతూరు తాండూరుకు వచ్చారు. ఇవాళ రెండో సోమవారం రావడంతో వేకువజామున నిద్ర లేచి పూజలు చేసి బయలుదేరారు.
ALSO READ: చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో పెరుగుతోన్న మృతుల సంఖ్య
అవే చివరి పూజ అవుతుందని తెలుసుకోలేకపోయారు. తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా వారెక్కిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. స్పాటులో అక్కాచెల్లెళ్లు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఆ ముగ్గుర్ని ఆ విధంగా చూసి చాలామంది కన్నీరు పెట్టుకున్నారు.
ప్రమాదం గురించి తెలియగానే ఆ తల్లిదండ్రులు భయబ్రాంతులకు గురయ్యారు. తమ పిల్లలకు ఏమీ కాకుడదని మొక్కుకున్నారు. అయినా విధి కరుణించలేదు. చదువులోనే కాదు.. చావులోనూ ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఈ లోకాన్ని వీడారు.