Hardik Pandya: ఆదివారం {నవంబర్ 2} న మహిళా వన్డే ప్రపంచ కప్ 2025 లో భాగంగా ముంబై నవీ లోని డివై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి టీమిండియా విజయం సాధించింది. దీంతో తొలిసారి వరల్డ్ కప్ గెలిచి విశ్వ విజేతగా నిలిచింది. సొంత గడ్డపై అంచనాలను అందుకుంటూ ఛాంపియన్ గా అవతరించింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.
Also Read: Ind vs Aus: వాషింగ్టన్ సుందర్ విద్వంసం.. భారత్ ఘనవిజయం
అనంతరం లక్ష్య చేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. ఈ క్రమంలో 52 పరుగుల తేడాతో సౌత్ఆఫ్రికాపై ఘన విజయం సాధించింది భారత జట్టు. ఇలా తొలిసారి భారత మహిళా క్రికెటర్లు ఐసీసీ కప్ సాధించడంతో భారత పురుష క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, క్రీడాభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. దేశమంతటా క్రీడాభిమానులు రోడ్లపైకి వచ్చి అర్ధరాత్రి వరకు సంబరాలు చేసుకున్నారు.
టీమిండియా మహిళా జట్టు ఛాంపియన్ గా నిలవడంతో దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే ముంబై వీధుల్లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై వీధుల్లో గంతులు వేస్తున్నట్లుగా ఓ వీడియో నెట్టింట చెక్కర్లు కొడుతుంది. వైరల్ గా మారిన ఈ వీడియోలో ముందు ఓ కార్ జాతీయ జెండాతో వెళ్లిన అనంతరం.. ఓ వ్యక్తి సాయంతో తెల్లటి దుస్తులలో ఉన్న హార్దిక్ పాండ్యా కుడి కాలికి పట్టితో గెంతుతూ.. జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ వెళుతున్నట్లుగా ఉంది. ఇక అతడిని చూస్తూ చుట్టుపక్కల ఉన్న క్రీడాభిమానులు బిగ్గరగా కేకలు వేస్తున్నారు. దీంతో హార్దిక్ పాండ్యాకి చెందిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ వీడియోలో ఉన్నది హార్దిక్ పాండ్యా కాదు.
తన భార్యతో విడాకుల అనంతరం హార్దిక్ పాండ్యా ఈ ఏడాది అక్టోబర్ లో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తన ఇంస్టాగ్రామ్ లో మోడల్ మహిక శర్మతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశాడు హార్థిక్ పాండ్యా. మహికా కూడా తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో హార్దిక్ పాండ్యా ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం మహికాతో విదేశాలలో ఎంజాయ్ చేస్తున్నాడు హార్దిక్ పాండ్యా. ఇక ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఈ పర్యటనకు హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు.
ఆసియా కప్ సూపర్ – 4 లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. ఆ గాయం నుంచి కోలుకోకపోవడంతో ఫైనల్ మ్యాచ్ లో ఆడలేదు. ఎడమ కాలి తొడ కండరానికి గాయం కావడం వల్ల హార్దిక్ పాండ్యా ప్రస్తుతం పూర్తి ఫిట్ గా లేడు. దీంతో ఆస్ట్రేలియా పర్యటనకి దూరమయ్యాడు. అంతేకాకుండా పాండ్యా ప్రస్తుతం విదేశాలలో ఉన్నాడు. అలాంటి హార్దిక్ పాండ్యా ముంబై వీధుల్లో ఎలా ఉంటాడు. అంతేకాకుండా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా హార్దిక్ పాండ్యా అంతమందిలో బయటికి వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో వైరల్ గా మారిన ఈ వీడియోలో కనిపిస్తుంది హార్దిక్ పాండ్యా కాదని స్పష్టం చేస్తున్నారు క్రీడా విశ్లేషకులు.
Hardik Pandya was celebrating India's womens world cup victory on street 😭🇮🇳🫡 pic.twitter.com/bkRp3P8jUE
— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) November 2, 2025