E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (13/10/2025) ఆ రాశి వారికి రియల్‌ ఎస్టేట్‌ లో లాభాలు – వారికి అనారోగ్య సమస్యలు  

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (13/10/2025) ఆ రాశి వారికి రియల్‌ ఎస్టేట్‌ లో లాభాలు – వారికి అనారోగ్య సమస్యలు  
Advertisement

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన అక్టోబర్‌ 13వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:  

చేపట్టిన వ్యవహారాలలో విజయం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో ఉంటాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.  బంధు మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

వృషభ రాశి:

Advertisement

ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వృధా ప్రయాణాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారములు మధ్యలో నిలిచిపోతాయి. సన్నిహితులతో  అకారణ విభేదాలు తప్పవు. అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

మిథున రాశి:  

వ్యాపారపరంగా ఉన్న ఇబ్బందులు క్రమ క్రమంగా తొలగుతాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహన, గృహ యోగములు ఉన్నవి. చిన్ననాటి స్నేహితులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి.

కర్కాటక రాశి:

Advertisement

నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. దగ్గరి వారి నుండి కీలక విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురు చూస్తున్న  అవకాశములు లభిస్తాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి. వ్యాపారమున లాభాలు కలుగుతాయి.

సింహరాశి:

దైవ సంబంధిత విషయములలో ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనులందు ఆటంకాలు తప్పవు. ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్న పాటి సమస్యలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.

కన్యారాశి :

సంతాన విద్యా విషయాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత తప్పదు. వ్యాపార, ఉద్యోగాలలో ఆందోళనలు పెరుగుతాయి. ఆత్మీయులతో అకారణ కలహ సూచనలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయం. ఉన్నత విద్యా ప్రయత్నాలు కలసివస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన సమావేశములకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన శుభకార్య విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

వృశ్చికరాశి:

చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.  కొత్త పరిచయాల వలన ఆర్థిక లాభాలుంటాయి. వ్యాపార ఉద్యోగాలలో అభివృద్ధి కలుగుతుంది. సోదరులతో స్థిరస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

ధనస్సు రాశి:

దూర ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతతకు దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. బంధు మిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి.

మకరరాశి:

వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం వలన నష్టాలు తప్పవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. నిరుద్యోగ  యత్నాలు కలిసిరావు. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది.

కుంభరాశి:

భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఆత్మీయులతో వున్న వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. దైవ సేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.

మీనరాశి:

చేపట్టిన పనులందు శ్రమ అధికమవుతుంది. ఇతరులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు పెరుగుతాయి. గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దాయాదులతో స్థిరాస్తి విషయమై ఉన్న సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×