OTT Movie : కొంత మంది ఆలోచనలు మరింత వైల్డ్ గా వస్తుంటాయి. ఊహించడానికి కూడా భయంకరంగా ఉండే స్టోరీలతో వస్తుంటారు. సైన్స్ ఫిక్షన్ జానర్ లో వచ్చిన ఒక హారర్ సినిమా విచిత్రమైన కథతో వచ్చింది. ఇందులో ఒక ఏలియన్ ఆమ్మాయిల కోరికల్ని తీరుస్తుంటుంది. భర్త దగ్గర కూడా దొరకని ఫీలింగ్ దాని దగ్గర దొరుకుతుంటుంది. ఇక క్లైమాక్స్ లో ఈ అరాచకానికి తెర పడుతుంది. ఒక్కో సీన్ ఆడియన్స్ మతిపోయేలా చేస్తుంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే
‘ది అన్‌టేమ్డ్’ (The Untamed) 2016లో వచ్చిన మెక్సికన్ సైన్స్ ఫిక్షన్ హారర్ సినిమా. దీనికి అమత్ ఎస్కలాంటే దర్శకత్వం వహించారు. ఇందులో రూత్ రామోస్, జెసస్ మెజా, సిమోన్ బుసియో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2017లో అమెరికాలో రిలీజ్ అయింది. IMDbలో 6.1/10 రేటింగ్ తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
మెక్సికోలో ఒక చిన్న ఊరిలో అలెజాండ్రా అనే గృహిణి, ఆమె భర్త ఆంజెల్ తో కలసి జీవిస్తుంటుంది. అయితే ఆమెను భర్త సంతోషంగా చూసుకోడు. ఎప్పుడూ గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. ఆమె సోదరుడు ఫాబియాన్ ఒక హాస్పిటల్ లో నర్స్‌గా పనిచేస్తుంటాడు. కథ ఇలా నడుస్తుండగా, ఒక రోజు ఆకాశం నుంచి ఒక వింత వస్తువు పడినట్లు అనిపిస్తుంది. అందులో ఒక భయంకర క్రీచర్ ఉంటుంది. వెరోనికా అనే మహిళ మొదటి సారిగా ఈ క్రీచర్‌ను చూస్తుంది. విచిత్రంగా క్రీచర్ ఆమెకు సుఖాన్ని ఇస్తుంది. దీంతో ఆమె ప్రతి రోజు దానితో ఆ అనుభవం పొందుతుంది.
Read Also : తోబుట్టువులతో ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… కెమెరా ముందే అంతా… డైరెక్టర్ కు చిప్పు దొబ్బిందా భయ్యా
వెరానికా ఈ క్రీచర్‌ను అలెజాండ్రాకు చూపిస్తుంది. అలెజాండ్రా కూడా క్రీచర్‌తో ఆ అనుభవం పొందుతుంది. ఇక ప్రతి సారి ఆనుభవం కోసం వీళ్ళు ఆ క్రీచర్ దగ్గరికి వస్తుంటారు. అయితే అంతే సమస్యలు కూడా వస్తాయి. వీళ్ళ జీవితాలు తలకిందులు అవుతాయి. ఈ స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. క్లైమాక్స్ మాత్రం మరింత భయంకరంగా ఉంటుంది. చివరికి ఆ క్రీచర్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? దాని నుంచి వీళ్ళు బయట పడతారా ? అనే విషయాలను, ఈ సైన్స్ ఫిక్షన్ హారర్ సినిమాను చూసి తెలుసుకోండి.