E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (17/10/2025) ఆ రాశి వారికి నూతన వాహన యోగం – మొండి బాకీలు వసూలు అవుతాయి

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (17/10/2025) ఆ రాశి వారికి నూతన వాహన యోగం – మొండి బాకీలు వసూలు అవుతాయి
Advertisement

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన అక్టోబర్‌ 17వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:  

ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి  ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

వృషభ రాశి:

Advertisement

చేపట్టిన  పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన రుణాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో  ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

మిథున రాశి:  

వ్యయప్రయాసలతో కాని పనులు పూర్తి కావు. దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు. బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.

కర్కాటక రాశి:

Advertisement

ఆరోగ్య ఈ విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ అంతగా ఫలించదు. బంధువులతో వివాదాలు తప్పవు. మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

సింహరాశి:

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల కలయిక  ఆనందం కలిగిస్తుంది. స్థిరస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విందువినోదాది ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి.

కన్యారాశి :

వ్యాపార, ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన  పనులు మందగిస్తాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవదర్శనాలు చేసుకుంటారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

ఆప్తుల నుండి శుభకార్య  ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట  ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.  మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు.

వృశ్చికరాశి:

రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక  వివాదాలు పరిష్కారవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి.  వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో పాత జ్ఞాపకాలను పంచుకుంటారు.

ధనస్సు రాశి:

దైవచింతన పెరుగుతుంది. ఖర్చుల  విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ముఖ్యమైన పనుల్లో ఊహించని ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు.  ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు.

మకరరాశి:

వ్యాపార వ్యవహారాల్లో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు  నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి.  ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

కుంభరాశి:

నూతన వాహనయోగం ఉన్నది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన ఆశలు చిగురిస్తాయి. సన్నిహితుల నుండి  శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

మీనరాశి:

నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×