Bigg Boss 9 : బిగ్ బాస్ చాలా ఆసక్తికరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అందరి కంటెస్టెంట్ల మీద ఒక అవగాహన చాలా వరకు వచ్చేసింది అయితే ఇంకా కొంతమంది నటిస్తున్నారు అనే అభిప్రాయం కూడా చాలామంది వీక్షకులకు ఉంది. ఫైర్ స్ట్రోమ్ గా ఆరుగురు కంటెస్టెంట్లను హౌస్ లోపలికి పంపించిన సంగతి తెలిసిందే. ఆల్మోస్ట్ షో సైలెంట్ గా అయిపోతుంది అనుకున్న టైం లో వీళ్లు వచ్చి మరీ షో ను వైలెంట్ చేసేసారు.
వీళ్లలో చాలా ఆసక్తికరమైన క్యారెక్టర్స్ దువ్వాడ మాధురి మరియు మోక్ష రమ్య. అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా రమ్య పాపులర్ అయిన సంగతి తెలిసిందే. పచ్చళ్ళు రేటు అడిగినందుకు ఒక పర్సన్ ను బూతులు తిట్టిన ఆడియో అప్పట్లో సోషల్ మీడియాలో కలకలం రేపింది. అప్పట్నుంచి వీళ్లు బాగా ఫేమస్ అయిపోయారు. అయితే దువ్వాడ మాధురి స్టేజ్ మీదే ఇంకా ఎవరి రంగులు బయటపడలేదు అందరి రంగులు బయటకు తీస్తాను అని నాగార్జునతో చెప్పి లోపలికి వచ్చింది.
భరణి హౌస్ లోపల చాలామందికి ఫేవరెట్ కంటెస్టెంట్. అందరూ భరణి అన్న భరణి అన్న అని పిలుస్తూ ఉంటారు. అయితే చాలామంది కెప్టెన్సీ టాస్క్ లో నిలుచుంటే నేను హెల్ప్ చేశాను అని భరణి పదేపదే చెబుతూ ఉంటాడు. భరణి పూర్తిగా ఓపెన్ కాలేదు అని అందరికీ ఒక రకమైన ఆలోచన ఉంది.
మొత్తానికి భరణి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాడు అనిపిస్తుంది. మొదట భరణి, తనుజ మధ్య మంచి బాండింగ్ ఉండేది. అయితే భరణిని టాస్కులు కోసం తనుజ ఒక బంధం పేరుతో ఉపయోగించుకుంటుంది అని ఆయేషా ఎంట్రీ ఇచ్చినప్పుడే చెప్పింది. ఆ తర్వాత దివ్య భరణి అది కూడా మంచి బంధం ఉండేది.
వీరిద్దరి మధ్య బంధం గురించి కూడా హౌస్ లో చాలా కామెంట్స్ వచ్చాయి. దువ్వాడ మాధురి వచ్చినప్పటి నుంచి దివ్యతో గొడవ పడుతూనే ఉంది. ఈ తరుణంలో భరణి దగ్గర కంప్లీట్ గా ఓపెన్ అయిపోయింది దివ్య. భరణి కూడా దివ్యతో కూర్చొని మాట్లాడుతూ ఆల్మోస్ట్ ఎమోషనల్ అయిపోయాడు. కొన్ని రోజులు మాట్లాడకుండా ఉండడం మంచిదే అని అభిప్రాయపడ్డాడు.
మరోవైపు భరణితో క్లోజ్ గా ఉంటే ఫైనల్ వరకు చేరిపోవచ్చు అనేది దివ్యకి ఉన్న ఉద్దేశం. అది బయటకు చెప్పకపోయినా కూడా హౌస్ లోకి దివ్య ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే భరణి గారితో క్లోజ్ గా ఉండడం మనం గమనించవచ్చు.
అలానే బయట నుంచి వచ్చిన వాళ్ళతో అలా ఉంటున్నారు అని దివ్య అంటుంది. కానీ రెండు వారాలు హౌస్ లో అందరూ సమయం గడిపిన తర్వాత బయట నుంచి వచ్చిన దివ్య కూడా భరణికి ఒక మంచి పేరు ఉండటం బట్టి భరణి తో కలిసి టాస్కులు ఆడటం ఒక బాండింగ్ కంటిన్యూ చేయటం జరుగుతుంది.
Also Read: Raghu Dixit : 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుంటున్న సింగర్ రఘు, వధువు ఎవరో తెలుసా?