Ritu Demon : ప్రతి సీజన్ లోను బిగ్బాస్ లో ఒక జంట బాగా పాపులర్ అవుతుంది. ఈసారి కూడా బిగ్ బాస్ మొదటి రోజే రీతు చౌదరి మరియు కళ్యాణ్ మధ్య ఒక లవ్ ట్రాక్ కొనసాగుతుంది అని అందరూ ఊహించారు. అనుకోని విధంగా వారిద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసిన వీడియో కూడా బాగా పాపులర్ అయింది.
అయితే కొన్ని రోజులు తర్వాత డిమాన్ పవన్, రీతు చౌదరి ఇద్దరూ కలిసి ఒక టీం గా కొన్ని టాస్కులు ఆడిన సంగతి తెలిసిందే. అయితే పిరమిడ్ టాస్క్ లో రీతు చౌదరి చేసిన ఫాల్ట్ కు పవన్ బాగా ఫీలయ్యాడు. మరోవైపు రీతు కూడా గుక్క పెట్టి ఏడ్చింది. మొత్తానికి వీళ్ళిద్దరూ ఎలిమినేషన్ లో లేకుండా సేఫ్ జోన్ కి వచ్చేసారు.
గత కొన్ని రోజుల నుంచి హౌస్ లో రీతూకి పవన్ కి మధ్య ఒక ట్రాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఫైర్ స్ట్రోమ్ రానంతవరకు వీళ్ళ బాండింగ్ బాగానే సాగింది. ఫైర్ స్ట్రోమ్ లో భాగంగా రమ్య మోక్ష ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం రమ్య మోక్షకు పవన్ మీద క్రస్ ఉన్నట్లు ఎపిసోడ్ చూస్తే అనిపిస్తుంది.
మరోవైపు రమ్యతో పవన్ మాట్లాడుతూ రీతు మీద లవ్ లేదు అనే విషయాన్ని చెప్పాడు. కానీ రీతు వచ్చి హగ్ ఇస్తే ఒక రకమైన లుక్ ఇచ్చాడు. ఇష్టం లేదనుకుంటునే హగ్స్ తీసుకుంటున్నాడు పవన్. మొత్తానికి పవన్ వెనక రమ్య తిరుగుతుంటే, పవన్ మాత్రం రీతూ వెనక తిరుగుతున్నాడు అని అర్థం అయిపోతుంది. పవన్ చాలా ఇన్నోసెంట్ అని రమ్య అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఇళయ దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాలో కప్పు ముఖ్యం బిగులు అన్నట్లు. హగ్స్ ముఖ్యం బిగులు అని పవన్ చూస్తే అర్థమవుతుంది. అప్పట్లో ఒక్క చిన్న టాస్క్ గెలిచినా కూడా పవన్ రీతు నుంచి హగ్స్ తీసుకోవడమే పని అయిపోయింది.
ఒక తరుణంలో సంజన తో కూడా వీడికి ఛాన్స్ దొరికితే చాలు అని అనిపించుకున్నాడు. అదే టైంలో సంజనాకు హగ్గు ఇవ్వబోతుంటే నాకు ఒక్క ఫ్యామిలీ ఉంది. మా ఇంటికి మాత్రమే వెళ్తాను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళను అని జోక్ చేసింది సంజన.
Also Read: Dude Movie : డ్యూడ్ కోసం డైరెక్టర్ కన్నీటి కథ… జూబ్లీహిల్స్ రోడ్లమీద పడిగాపులు