E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (19/10/2025) ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు చిక్కులు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (19/10/2025) ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు చిక్కులు
Advertisement

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన అక్టోబర్‌ 19వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:  

చాలకాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. కీలక సమయంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.

వృషభ రాశి:

Advertisement

ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఇంటా బయట బాధ్యతలు ఒత్తిడికి గురిచేస్తాయి. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు.

మిథున రాశి:  

వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు తప్పవు. ముఖ్యమైన పనులలో  శ్రమకు తగిన ఫలితం ఉండదు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. దైవ దర్శనం చేసుకుంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారమునా సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.

కర్కాటక రాశి:

Advertisement

వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  ఉద్యోగాలలో జీతభత్యాలు విషయంలో అనుకూలత కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో  పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది.

సింహరాశి:

భూ సంబంధిత వివాదాలు మరింత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.  మానసిక చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ నిర్వహణలో లోపం వలన అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.

కన్యారాశి :

చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక వృద్ధి, పాత ఋణాలు తీర్చగలుగుతారు. నూతన వస్తు  వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు తగిన అవకాశాలు లభిస్తాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

ఉద్యోగమున అధికారులతో వాదాలకు వెళ్లకపోవడం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు.

వృశ్చికరాశి:

చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.  కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

ధనస్సు రాశి:

సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి.  బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.  గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

మకరరాశి:

వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికామౌతుంది. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన ఋణ యత్నాలు కలసిరావు. ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు.

కుంభరాశి:

ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలుతో కాని  పూర్తికావు.  వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

మీనరాశి:

వ్యాపారపరంగా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశములు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు తరువాత కాలానికి ఉపయోగపడతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×