Gundeninda GudiGantalu Today episode October 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ మీనా కుటుంబాన్ని దారుణంగా అవమానిస్తాడు. కనీసం 1000 రూపాయలు కూడా ఇవ్వలేరు అంటూ దారుణంగా అవమానించి మాట్లాడుతారు.. మనోజ్ నీ బాలు కొడతాడు. మీనా గురించి తక్కువ చేసి మాట్లాడితే మర్యాదగా ఉండదు అని బాలు మనోజ్ నీ కొడతాడు.. మీనా వదినను ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకోను అని రవి కూడా అంటాడు. వీళ్ళ ముగ్గురు కొట్టుకోవడం వరకు వెళ్తారు. రోహిణి మాత్రం మీనాకు కావాలని ఎగతాళి చేస్తూ మాట్లాడుతుంది. మేము కష్టపడి సంపాదించి ఇస్తున్నాము. నువ్వు మావయ్య గారి దగ్గర మంచి పేరు కొట్టడానికి ఇంట్లోకి సరుకులు తెస్తున్నానని చెప్తున్నావా అని రోహిణి అడుగుతుంది. శృతి మీనా ఇద్దరు కలిసి రోహిణికి మాట్లాడే అవకాశం లేకుండా చేస్తారు. ఇంకాసేపు ఇక్కడే ఉంటే కచ్చితంగా దొరికిపోతానని రోహిణి అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. కోపంగా వచ్చిన బాలు ఏమైంది అని అడుగుతాడు.. రోహిణి మీరు గొప్పలకు పోయే డబ్బులు ఇస్తామన్నారు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అని ఎగతాళి చేస్తూ మాట్లాడిందని బాలుతో మీనా అంటుంది. రోహిణి అన్నది కూడా నిజమే కదా మనం అంత డబ్బులు ఎలా తెచ్చి ఇస్తాము అని అంటుంది. మీనా మాట వినగానే నువ్వే నా ఈ మాట మాట్లాడుతున్నావు. మనకేమీ చేతకాదా కష్టపడుతున్నాం కదా మనమే డబ్బులు అందరికన్నా ముందు ఇస్తాం అని బాలు అంటాడు. మనల్ని చులకన చేసి మాట్లాడుతున్నప్పుడు మనం ఇవ్వడం ఎందుకండీ అని బాలతో అంటుంది మీనా.. ఈ తలనొప్పి తగ్గాలంటే నువ్వు నాకు ఒకటి ఇవ్వాలి అని బాలు అంటాడు.
తర్వాత రోజు దీపావళి సందర్భంగా ఇంట్లో సంబరాలు మొదలవుతాయి. మీనా ఉదయాన్నే లేచి బయట ముగ్గు వేసి దీపావళి పండుగకు అంత సిద్ధం చేస్తుంది. ప్రభావతితో సహా అందరూ కూడా దీపావళి కోసం పూజలు చేస్తారు. ఇంట్లో ఎంతో సందడి వాతావరణం నెలకొంటుంది. సత్యం తమ ముగ్గురు కోడళ్ళకు దీపావళి కానుకలు ఇస్తాడు. ముగ్గురు కలిసి ఎరుపు రంగు చీరలో పూజకు వస్తారు. ఇంటిని పూలతో ముస్తాబు చేయడంతో పాటుగా దీపాలతో ఎంతో చక్కగా అలంకరిస్తారు. ఇక అందరూ సరదాగా పూజను మొదలు పెడతారు. పూజ పూర్తవ్వగానే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. పండగ రోజు పూలకు మంచి డిమాండ్ ఉంటుందని మీనా ఈరోజు చేస్తే మనకి మంచిగా డబ్బులు వస్తాయని బాలుతో అంటుంది..
ఇక బాలు కూడా ఇవాళ చాలామంది గుడిలోకి వెళ్లే వాళ్ళు ఉంటారు కదా.. నేను కూడా ట్రిప్ కి వెళ్తాను మనం అనుకున్న దాని కంటే ఎక్కువ గాని సంపాదించి చూపించాలి. ఎక్కడ తగ్గేదే లేదు అంటూ అంటాడు. మీనా పూలు డెలివరీ ఇవ్వడానికి ఒక ఇంటికి వెళ్తుంది. అక్కడ పూలని డెలివరీ చేసి వస్తుంది. అలా తనకి వచ్చిన ఆర్డర్ల ప్రకారం పూలనే డెలివరీ చేసేందుకు మీనా వెళ్తుంది. దినేష్ రోహిణి కి కాల్ చేస్తాడు. ఏంటి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు అని బెదిరిస్తాడు. మనుషుల్ని పెట్టి కొట్టించిన నీకు బుద్ధి రాలేదా నన్ను ఇంకా వదలవా అని రోహిణి అంటుంది.
నువ్వు మనుషులని పెట్టి కొట్టించినందుకే నీ మీద ఇంకా నాకు కసి పెరిగింది నీ గురించి అన్ని నిజాలను బయట పెట్టేస్తాను అని బెదిరించేస్తాడు. నువ్వు అర్జెంటుగా నాకు లక్ష రూపాయలు ఇవ్వకుంటే మీ ఇంటికి వచ్చి ఈ విషయాన్ని ఫోటోలతో సహా చూపిస్తాను అని రోహిణి బెదిరిస్తాడు. రోహిణి వెంటనే విద్య దగ్గరికి వెళ్తుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఆ దినేష్ గాడు వెంటనే లక్ష రూపాయలు ఇవ్వాలని అంటున్నాడు. నాకు భయంగా ఉంది ఎవడు అన్నట్లుగానే ఆ చేసేస్తాడేమో.. వాడికి కచ్చితంగా లక్ష రూపాయలు ఇవ్వాలి అని అనుకుంటుంది.
Also Read :నర్మదకు అడ్డంగా దొరికిపోయిన శ్రీవల్లి.. సిగ్గుపడ్డ వేదవతి.. ధీరజ్ కోసం ప్రేమ రచ్చ..
విద్య నువ్విలా వాడికి రోజు డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్తుంటే వాడు ఇంకా రెచ్చిపోయి నిన్ను డబ్బులు అడుగుతూనే ఉంటాడు. నువ్వు వాడికి ఇంకా డబ్బులు ఇవ్వద్దు ఏం చేస్తాడు చేసుకుని అని అంటుంది. రోహిణిని దినేష్ కిడ్నాప్ చేయాలని అనుకుంటాడు. ఓ ఇంటికి వెళ్లిన రోహిణిని తీసుకు రమ్మని తన మనుషులని పంపిస్తాడు. అదే ఇంటికి పూలను డెలివరీ చేయడానికి మీనా వెళ్తుంది. ఎర్ర చీరలో ఉంటుంది అని చెప్పగానే మీలానే కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తారు.. బాలు మీనా ఎక్కడికి వెళ్లిందో టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో రోహిణి బండారం దినేష్ బయట పెడతాడా లేదా అన్నది చూడాలి..