E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (23/10/2025) ఆ రాశి వారికి శుభవార్తలు –  వారికి ఊహించని సమస్యలు  

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (23/10/2025) ఆ రాశి వారికి శుభవార్తలు –  వారికి ఊహించని సమస్యలు  
Advertisement

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన అక్టోబర్‌ 23వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:  

ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలు అంతగా కలిసి రావు.  చేపట్టిన  పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

వృషభ రాశి:

Advertisement

వ్యాపారాలలో ఆశించిన  పురోభివృద్ధి కలుగుతుంది. చేపట్టిన పనులలోశ్రమ ఫలిస్తుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి బయట పడగలుగుతారు. నూతన  కార్యక్రమాలకు  శ్రీకారం చుడతారు. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

మిథున రాశి:  

స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య  ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. విందువినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి:

Advertisement

వ్యాపారపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు నష్టాలను మిగులుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.

సింహరాశి:

చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. బంధువుల నుంచి ఋణ ఒత్తిడులు అధికమౌతాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

కన్యారాశి :

కుటుంబ సభ్యులతో  శుభకార్యాలలో పాల్గొంటారు. వివాదాలకు సంబంధించి కీలక సమాచారం సేకరిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం  సాధిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

వృత్తి వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి.  బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన  పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి.

వృశ్చికరాశి:

స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య  ఆహ్వానాలు అందుతాయి. గృహమున  శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

ధనస్సు రాశి:

చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయప్రయాసలతో కాని పూర్తి కావు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి. ఆధ్యాత్మిక చింతన అవుతుంది.

మకరరాశి:

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమవుతాయి. సంతానానికి  నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

కుంభరాశి:

ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందగలుగుతారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. నూతన వాహనయోగం ఉన్నది.

మీనరాశి:

వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×