OTT Movie : మూడు నెలల క్రితం థియేటర్లలో విడుదలైన ఒక చిత్రాన్ని, ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ప్రసారం చేసింది. ఈ 2 గంటల 24 నిమిషాల సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా పరాజయం పాలైంది. అయితే ఓటీటీలో విడుదలైనప్పటి నుండి దాని అదృష్టం మారిపోయింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ టాపిక్‌గా మిగిలిపోయింది. 2025లో పెద్ద పరాజయం పాలైనప్పటికీ, ఈ కామెడీ థ్రిల్లర్ ఓటీటీలో తప్పక చూడాల్సిన చిత్రంగా మారింది. ఇది ఏ సినిమా ? ఏ సూపర్ స్టార్ ఇందులో నటించారు ? అనే సందేహాలకు, సమాధానాలను కూడా తెలుసుకుందాం పదండి.
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతున్న ఈ చిత్రం పేరు ‘Son of sardaar 2’. 2025 ఆగస్టు 1న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నిరాశపరిచింది. నివేదికల ప్రకారం, ఈ మల్టీస్టారర్ బడ్జెట్ దాదాపు ₹130 కోట్లుగా అంచనా వేయబడింది. అయితే ఇది దేశీయ బాక్సాఫీస్ వద్ద ₹47 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా ₹65 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా 2010లో విడుదలైన అజయ్ దేవగన్ సూపర్‌హిట్ సినిమా ‘Son of sardaar’ కి సీక్వెల్. ఇప్పుడు వచ్చిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 5లో ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో అజయ్ దేవగన్ తో పాటు,రవి కిషన్, నీరు బజ్వా, దీపక్ దోబ్రియాల్, విందు దారా సింగ్, సంజయ్ మిశ్రా, మృణాల్ ఠాకూర్ చంకీ పాండే వంటి నటులు కూడా కీలక పాత్రల్లో నటించారు.
Read Also : ఎనిమీతోనే బెడ్ షేర్ చేసుకునే అరాచకం… అల్టిమేట్ డేర్… ట్విస్టులతో పిచ్చెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్
జస్సీ అనే సర్దార్ పంజాబ్‌లో తన తల్లి డాలీతో సంతోషంగా ఉంటాడు. అతని భార్య డింపుల్ ఉద్యోగం కోసం స్కాట్లాండ్ వెళ్లిపోతుంది. వాళ్ల మధ్య గొడవలు జరగడంతో, డింపుల్ విడాకులు కోరుతుంది. జస్సీ, డింపుల్ ప్రేమను తిరిగి గెలవడానికి స్కాట్లాండ్ వెళ్తాడు. అక్కడ అతను రాజా సంధు అనే మాఫియా లీడర్‌తో గొడవలో చిక్కుకుంటాడు. జస్సీ తన తెలివితో ఈ గొడవ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. స్కాట్లాండ్‌లో జస్సీ డింపుల్ ను కలవడానికి ప్రయత్నిస్తూ, ఒక పెద్ద సర్దార్ వెడ్డింగ్‌లో చిక్కుకుంటాడు. ఈ వెడ్డింగ్‌లో ఫన్నీ సంఘటనలు, గందరగోళాలు జరుగుతాయి.
అదే సమయంలో రాజా సంధు మాఫియా గొడవలు కూడా జస్సీని వెంటాడతాయి. జస్సీ తన భార్య డింపుల్ ను మళ్లీ ప్రేమలో పడేలా చేయడానికి ఆమెతో మాట్లాడతాడు. కానీ మాఫియా గొడవలు, వెడ్డింగ్ గందరగోళం అడ్డుపడతాయి. ఇక క్లైమాక్స్ లో రాజా సంధు మాఫియా గొడవలను తన తెలివితో సాల్వ్ చేస్తాడు జస్సీ. వెడ్డింగ్ గందరగోళంలో కూడా అందరినీ సంతోషపెడతాడు. డింపుల్, జస్సీ ప్రేమను అర్థం చేసుకొని, అతనితో మళ్లీ కలిసిపోతుంది. ఏ కథకి ఇలా శుభం కార్డ్ పడుతుంది.