MeghaSandesham : వినోదాన్ని పంచడంలో సినిమాలను మించి సీరియల్స్ ఈమధ్య స్టోరీలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ ఒక్కొక్కటి ఒక్కో స్టోరీ తో జనాలను అలరిస్తున్నాయి. ఇకపోతే జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ కొన్ని గ్రాఫిక్స్ తో ఔరా అనిపిస్తున్నాయి. అలాంటి వాటిలో మేఘసందేశం ఒకటి.. మేఘసందేశం సీరియల్ రోజురోజుకు టీఆర్పీ రేటింగ్‌లో దూసుకుపోతుంది.. ఈ సీరియల్లో హీరోయిన్ పాత్ర లో భూమి నటించింది. భూమి రియల్ నేమ్? ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్? రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
జీ తెలుగులో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న మేఘసందేశం సీరియల్ లో నటించిన భూమి గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈమె అసలు పేరు భామిక రమేష్.. ఈమె కర్ణాటక కు చెందిన నటి. ఇప్పుడు 20 సంవత్సరాలు. అయితే భూమి చైల్డ్ ఆర్టిస్టుగా బుల్లితెర ప్రేక్షకులు సుపరిచితురాలు.. కన్నడ ఇండస్ట్రీ లో ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమైన డాన్సింగ్ స్టార్ అనే షోలో పాల్గొని అందరి మనసుని దోచుకుంది. ఈ కార్యక్రమానికి జడ్జిగా చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్.. భూమి డాన్స్ చూసి ఆశ్యర్యపోయారు. ఆమె ఫెర్మామెన్స్ కు ఫిదా అయ్యారు. ఫ్యూచర్ లో మంచి నటి అవుతుందని ఆయన ఏమని అన్నారో అలానే నటి అయి ప్రస్తుతం సీరియల్స్ లలో నటిస్తూ బిజీగా ఉంది. యాక్టింగ్ అంటే ఇష్టం ఉండడం తో చిన్నప్పటినుంచి తన డాన్స్ టాలెంట్ తో ఆడిషన్స్ కి వెళ్లేదట.. అలా తన టాలెంట్ మిర్చి కన్నడ సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. అక్కడ పలు సీరియల్స్ లో నటించి తెలుగులో మేఘసందేశం సీరియల్ ద్వారా పరిచయమైంది.
భూమిక డ్యాన్సర్ గా కూడా చిన్నప్పటి నుంచి చేస్తూ మంచి పేరును సంపాదించుకుంది.. ఒకవైపు డాన్సర్ తన కెరియర్ ని మొదలు పెట్టాలని ఆడిషన్స్ కి వెళ్ళలేదట.. తన ప్రొఫెషన్ ని తన ఫ్యాషన్ ని రెండు వదులుకోకుండా నటనపై ఆసక్తి ఉండడంతో అటుగా అడుగులు వేసింది. ప్రస్తుతం ఈమె జీ తెలుగు లో ప్రసారమవుతున్న మేఘ సందేశం సీరియల్ లో నటిస్తుంది. ఇందులో భూమి పాత్రలో నటిస్తుంది. కన్నడ సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయిన ఈ నటి ఒక్కరోజుకి భారీగానే వసూలు చేస్తుంది. దాదాపు ఈమె ఒక్కరోజుకు 25 వేలు రెమ్యూనరేషన్ ను అందుకుంటుంది. అందరిలాగే సీరియల్ ద్వారా లక్షలు సంపాదిస్తూ బిజీగా ఉంది. ఒకవైపు డైలీ సీరియల్స్లలో నటిస్తూనే మరోవైపు డిగ్రీని పూర్తిచేసే పనిలో ఉంది. తెలుగులో మాత్రమే కాదు అటు కన్నడలో కూడా ఈమె వరసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. ఈమధ్య పలు డాన్స్ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ తన టాలెంట్ని నిరూపించుకునే పనిలో ఉంది.