BigTV English
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (29/10/2025) ఆ రాశి వారికి వ్యాపారంలో నష్టాలు – ఉద్యోగులకు ప్రమోషన్లు 

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (29/10/2025) ఆ రాశి వారికి వ్యాపారంలో నష్టాలు – ఉద్యోగులకు ప్రమోషన్లు 

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన అక్టోబర్‌ 29వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:  

చేపట్టిన వ్యవహారములో విజయం సాధిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా    సాగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు  వసూలవుతాయి.

వృషభ రాశి:

ఉద్యోగమున  పదోన్నతులు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో  పరిచయాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు.


మిథున రాశి:  

ముఖ్యమైన వ్యవహారాలలో  తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి.

కర్కాటక రాశి:

చేపట్టిన  పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. వ్యాపారమునకు సకాలంలో పెట్టుబడులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతాయి.

సింహరాశి:

సంఘంలో విశేష  గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహన లాభాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యాపార వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది.

కన్యారాశి :

వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ  సేవలకు తగిన గుర్తింపు అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు వలన మానసిక సమస్యలు కలుగుతాయి.  వ్యాపార, ఉద్యోగాలు  మందగిస్తాయి. ఇంటాబయట చికాకులు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన  పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.

వృశ్చికరాశి:

ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.  ఇంటాబయట బాధ్యతలు మరింతగా పెరుగుతాయి.  వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు.

ధనస్సు రాశి:

భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగవ్యాపారాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు.

మకర రాశి:

ఆరోగ్యం మందగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పాత రుణాలు తీర్చడానికి  నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి.

కుంభరాశి:

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరణకు తీసుకున్న నిర్ణయాలు కలసి వస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి.

మీనరాశి:

కొన్ని పనులలో శ్రమ తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. దాయదులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (28/10/2025) ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – రాజకీయ ప్రముఖులతో పరిచయాలు  

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (27/10/2025) ఆ రాశి వారికి శుభవార్తలు – కొత్త వ్యక్తుల పరిచయాలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (26/10/2025) ఆ రాశి వారు విలువైన వస్తు, వాహనాలు కొంటారు – వారి మాటకు విలువ పెరుగుతుంది 

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (అక్టోబర్‌ 26 – నవంబర్‌ 01) మిత్రులతో అకారణ వివాదాలు – ఉద్యోగులకు ఆఫీసులో చికాకులు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (25/10/2025) ఆ రాశి వారికి వ్యాపారాల్లో లాభాలు – చేపట్టిన పనుల్లో విజయాలు 

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (23/10/2025) ఆ రాశి వారికి శుభవార్తలు –  వారికి ఊహించని సమస్యలు  

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (22/10/2025) ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారికి ఊహించని సమస్యలు

Big Stories

×