Nirupam Paritala: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాప్ డైలీ సీరియల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు కార్తీకదీపం.. ఈ సీరియల్ ప్రస్తుతం టాప్ రేటింగ్ లో కొనసాగుతుంది. గతంలో వచ్చిన కార్తీకదీపం సీరియల్ గా ప్రస్తుతం కార్తీకదీపం 2 వస్తుంది. ఇందులో హీరో డాక్టర్ బాబు గురించి చాలామందికి తెలియదు. డాక్టర్ బాబు పాత్రలో నటించిన అతని అసలు పేరు నిరూపమ్ పరిటాల.. బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో నటించి బాగా ఫేమస్ అయ్యాడు. అయితే ఇప్పటివరకు ఈయన సినిమాలలో సీరియల్స్లలో మాత్రమే నటించారని అనుకున్నారు. కానీ సినిమాలు కూడా చేశారని చాలామందికి తెలియకపోవచ్చు. ఈ వార్త విన్న ఆయన అభిమానులు అమ్మదొంగా నువ్వు కూడా సినిమాలు చేసావా అంటూ సోషల్ఆఈ వార్త విన్న ఆయన అభిమానులు అమ్మదొంగా నువ్వు కూడా సినిమాలు చేసావా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మరి ఆయన చేసిన సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
కార్తీకదీపం హీరో నిరుపమ్ పరిటాల తండ్రి దివంగత ఓంకార్ పరిటాల. ఆయన టాలీవుడ్ ఫేమస్ రైటర్, యాక్టర్, డైరెక్టర్.. 50 సీరియల్స్ కి 30 సినిమాలకి పని చేశారు. ఈయన వారసుడుగా కార్తీక్ అలియాస్ నిరూపం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదట వెండితెరపై అడుగుపెట్టి అక్కడ పలు సినిమాల్లో నటించారు. ‘ఫిటింగ్ మాస్టర్’, ‘రభస’ వంటి సినిమాలలో కూడా నటించినప్పటికీ, అతనికి ఎక్కువ గుర్తింపు రాలేదు. ఆ తర్వాత బుల్లితెరపై అడుగుపెట్టి వరుసగా సీరియల్స్ చేస్తూ వస్తున్నాడు. ‘కార్తీక దీపం 2 తో పాటు , ‘హిట్లర్ గారి పెళ్లాం’, ‘కుమారి శ్రీమతి’ తదితర సీరియల్స్‌లో నటిస్తున్నారు నిరుపమ్..
సీరియల్ లో నటించిన వాళ్లు సైతం బిజినెస్ లు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. కార్తీకదీపం సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయిన నిరూపం పరిటాల వరుసగా సీరియల్స్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడు. అందరిలాగే ఈయన కూడా దీపం ఉండగానే ఇంటిని చక్క పెట్టుకోవాలని అనుకుంటున్నాడు. దాంతో కొత్తగా తన భార్యతో కలిసి బిజినెస్ లోకి అడుగు పెట్టాడు.
రెమ్యూనరేషన్..?
ఒక్క రోజు షూటింగ్‌కు సుమారు 30 వేల వరకు ఆయన తీసుకుంటున్నట్లు టాక్. టీవీ సీరియల్స్‌తో పాటు వివిధ టీవీ షోలు, ఈవెంట్స్, ప్రకటనల ద్వారా బాగానే సంపాదిస్తున్నాడు. సీరియస్ నెలపొడుపున షూటింగ్ ఉండడంతో ఎక్కువమంది సీరియస్ ద్వారా లక్షల్లో సంపాదిస్తూ వస్తున్నారు. తన భార్య మంజులతో కలిసి సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ అటు కూడా సంపాదిస్తూ వస్తున్నాడు. సోషల్ మీడియాలో వీళ్ళ ఫోటోలుకి రీల్స్ కి ఫ్యాన్స్ ఉన్నారు. తన భార్య తో కలిసి చేసిన రీల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే తన భార్య కూడా సీరియల్ యాక్టర్ అన్న విషయం చాలామందికి తెలుసు. ప్రస్తుతం ఆమె కూడా వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. భార్యాభర్తలిద్దరూ కూడా టాప్ పొజిషన్లో ఉన్న యాక్టర్స్ కావడంతో రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే వస్తుంది.