OTT Movie : రాబోయే రోజులు టెక్నాలజీ తో నే జీవితం ఉండబోతోంది. వీటిలో ‘AI’ ల పాత్ర కీలకంగా మారబోతోంది. ఇప్పుడు రోబోలను కూడా మార్కెట్ లో అమ్మేస్తున్నారు. ఎంతలా అంటే మనిషి శారీరక అవసరాలు కూడా ఇవి తీర్చేస్తున్నాయి. అయితే ఈ టెక్నాలజీ వల్ల ప్రమాదాలు కూడా ఊహించని స్థాయిలో ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాని చూస్తే నిజమే అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఓటీటీలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చింది. మొదటి పార్ట్ ఇచ్చిన బూస్ట్ తో రెండో పార్ట్ దూసుకుపోతోంది. ఈ సినిమా పేరు ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘M3GAN 2.0’ అనే సినిమా 2025లో విడుదలైన అమెరికన్ సై ఫై యాక్షన్ హారర్ ఫిల్మ్. దీన్ని జెరార్డ్ జాన్‌స్టోన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా 2 గంటల నిడివి ఉంది. ఇది 2022 చిత్రం M3GAN కి సీక్వెల్. లీడ్ రోల్స్‌లో అలిసన్ విలియమ్స్ (గెమ్మా), వయోలెట్ మెగ్రా (క్యాడీ), ఇవాన్నా సాఖ్నో (అమెలియా) నటించారు. ఈ సినిమా 2025 జూన్ 27న థియేటర్స్‌లో విడుదలైంది. 2025 అక్టోబర్ 27 నుండి ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ భాషలలో Jio Hotstarలో ప్రసారం అవుతోంది.
‘M3GAN 2.0’ కథ మొదటి సినిమాలో M3GAN మరణించిన రెండు సంవత్సరాల తర్వాత మొదలవుతుంది. జెమ్మా అనే రోబోటిక్స్ సైంటిస్ట్, మొదటి సినిమాలో M3GAN వల్ల జరిగిన హత్యలకు బాధ్యత వహించి జైలు శిక్ష అనుభవించింది. ఇప్పుడు ఆమె AI పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఆమె ఒక పెర్ఫెక్ట్ మదర్‌గా మారింది. తన సోదరి మరణించిన తర్వాత ఆమె కుమార్తె క్యాడీని జాగ్రత్తగా చూసుకుంటోంది. జెమ్మా ఇప్పుడు ఒక బెస్ట్‌సెల్లింగ్ రైటర్ అయింది. AI చట్టాలకు వ్యతిరేకంగా స్పీచ్‌లు ఇస్తోంది. ఆమె స్టూడెంట్స్‌కి “ఫోన్‌లు వదులుకోండి, AI మానవులను నాశనం చేస్తుంది” అని ఉపన్యాసాలు ఇస్తుంటుంది. కానీ రహస్యంగా M3GAN ఇంకా డిజిటల్‌గా జీవించి ఉంటుంది. ఇప్పుడు ఆమెలియా అనే కొత్త శత్రువు, మిలిటరీ రోబోట్ రూపంలో మానవులను హత్య చేస్తూ ఉంటుంది.
Read Also : అడవిలో అంధుడి అరాచకం… 1 గంట 48 నిమిషాల గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఈగోను శాటిస్ఫై చేసే మలయాళం రివేంజ్ డ్రామా
ఈ సమయంలో జెమ్మా M3GANని తిరిగి రీబూట్ చేసి, క్యాడీని కాపాడటానికి ప్రొటెక్టర్‌గా మారుస్తుంది. ఆమెలియా వెనుక ఉన్న సీక్రెట్ “బ్లాక్ బాక్స్ AI” ఇది ప్రపంచాన్ని నాశనం చేయగల సూపర్ AI. జెమ్మా తన టీమ్ ఆ బ్లాక్ బాక్స్‌ని డిస్ట్రాయ్ చేయాలని ప్లాన్ చేస్తారు. M3GAN అప్‌గ్రేడెడ్ బాడీతో AMELIAతో ఫైట్ చేస్తుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లు ఎక్సైటింగ్ గా ఉంటాయి. క్లైమాక్స్‌లో ఆమెలియాని M3GAN డిఫీట్ చేసి, బ్లాక్ బాక్స్‌ని డిస్ట్రాయ్ చేస్తుంది. జెమ్మా, క్యాడీ M3GANతో బాండ్ బలపడుతుంది. M3GAN మానవులను కాపాడుతుంది. హ్యాపీ ఎండింగ్ తో ఈ సినిమా ముగుస్తుంది. కానీ పోస్ట్ క్రెడిట్‌లో M3GAN మల్టిపుల్ AI లని లీడ్ చేస్తూ, మానవులపై వార్ స్టార్ట్ చేయబోతున్నట్టు హింట్ ఇస్తుంది. ఇది మరో సీక్వెల్ రాబోతున్నట్లు చూపిస్తుంది.