E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (04/10/2025) ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త – చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (04/10/2025) ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త – చేపట్టిన పనుల్లో విజయం
Advertisement

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన అక్టోబర్‌ 4వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:  

కుటుంబ విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ధన వ్యవహారాలు అనుకూలంగా  సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.  వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

వృషభ రాశి:

Advertisement

ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్య పరుస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.  నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

మిథున రాశి:  

వృత్తి వ్యాపారాలలో పార్టీ సమస్యలు కలుగుతాయి.   ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం కలుగుతుంది. బంధు మిత్రులతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబసభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఇతరుల  విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

కర్కాటక రాశి:

Advertisement

మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. వ్యాపార ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పరిస్థితులు నిరుత్సాహ పరుస్తాయి. ఇంటాబయటా చికాకులు తప్పవు.  నిరుద్యోగ యత్నాలు మందగిస్తాయి.

సింహరాశి:

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆశ్చర్యం కలిగిస్తుంది. బంధు మిత్రులతో పాత విషయాల గురించి చర్చలు చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.   వ్యాపార ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి.

కన్యారాశి :

సన్నిహితులతో వివాదాలు సాధ్యమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన పరిచయాలు విస్తృతం అవుతాయి. వివాహాది శుభకార్యాలకు  కుటుంబ సభ్యులతో హాజరవుతారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.

 ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర  ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాలలో వివాదాలు తప్పవు. రుణ ఒత్తిడి అధికమవుతుంది. శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తికావు. ఉద్యోగము అధికారులతో చర్చలు ఫలించవు.

వృశ్చికరాశి:

వృత్తి, ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి. దూర ప్రాంత మిత్రుల నుండి అందిన సమాచారం మానసిక బాధను కలిగిస్తుంది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

ధనస్సు రాశి:

వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.  నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

మకరరాశి:

వ్యాపారంలో మన భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది. కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి. సంతానం  విద్యా పరంగా మరింత సారించడం మంచిది.

కుంభరాశి:

వృత్తి  ఉద్యోగాలలో అవరోధాలను అధిగమించి పదోన్నతులు పొందుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ  ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. బంధువర్గం నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది.

మీనరాశి:

ఆకస్మిక ప్రయాణ సూచనలు  ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని  ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. చేపట్టిన పనులలో ఎంత కష్టపడినా ప్రతిఫలం  ఉండదు.  దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×