OTT Movie : చిన్న పిల్లలకి చాక్లెట్స్ అంటే ఎంత మక్కువో అందరికీ తెలిసిందే. వీటి కోసం ఏడుస్తారు, ఏడుపులను కూడా మానేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా ఒక తియ్యని చాక్లెట్ లా ఉంటుంది. కొంత మంది పిల్లలు ఒక చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించడంతో అసలు కథ మొదలవుతుంది. ఈ సినిమా చిన్న పిల్లల కోసమే. అయితే పెద్ద వాళ్ళతో కలసి చూస్తే మరింత మజా ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘చార్లీ అండ్ ది చాక్లెట్ ఫ్యాక్టరీ’ అమెరికన్ ఫాంటసీ కామెడీ సినిమా. దీనికి టిమ్ బర్టన్ దర్శకత్వం వహించారు. ఇందులో జానీ డెప్ (విల్లీ వాంకా), ఫ్రెడ్డీ హైమోర్ (చార్లీ బకెట్), డేవిడ్ కెల్లీ (గ్రాండ్‌పా జో) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2005 జూలై 15న రిలీజ్ అయింది. 1 గంట 55 నిమిషాల రన్ టైమ్ తో IMDbలో 6.6/10 రేటింగ్ పొందింది. Netflix, Amazon Prime Videoలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
చార్లీ ఒక పేద అబ్బాయి. ఒక చిన్న ఇంట్లో తన తల్లిదండ్రులు, గ్రాండ్‌పేరెంట్స్‌తో ఉంటాడు. అతను గ్రాండ్‌పా జోతో క్లోజ్ గా ఉంటాడు. చార్లీ విల్లీ వాంకా చాక్లెట్ ఫ్యాక్టరీ గురించి చాలా స్టోరీలు వింటాడు. విల్లీ వాంకా ప్రపంచంలోనే బెస్ట్ చాక్లెట్ మేకర్. కానీ అతని ఫ్యాక్టరీలోకి ఎవరికీ ఎంట్రీ ఉండదు. ఒక రోజు వాంకా ఒక ప్రకటన ఇస్తాడు. తన చాక్లెట్ బార్‌లలో ఐదు గోల్డెన్ టికెట్స్ ఉన్నాయని, ఆ టికెట్స్ గెట్ చేసిన పిల్లలు తన ఫ్యాక్టరీని విజిట్ చేయవచ్చని చెప్తాడు. అయితే చార్లీకి చాక్లెట్ కొనడానికి కూడా డబ్బు ఉండదు. కానీ అదృష్టవశాత్తూ అతనికి ఒక టికెట్ దొరుకుతుంది. మిగతా నలుగురు పిల్లలు కూడా టికెట్స్ గెట్ చేస్తారు. చార్లీ, గ్రాండ్‌పా జోతో ఫ్యాక్టరీ టూర్‌కి ఎక్సైటింగ్‌గా వెళతాడు.
మిగతా నలుగురు పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ తో వస్తారు. ఫ్యాక్టరీలో విల్లీ వాంకా వీళ్ళను ఫన్నీగా రిసీవ్ చేసుకుంటాడు. తన ఫ్యాక్టరీని మ్యాజికల్‌గా చూపిస్తాడు. కానీ అక్కడ ఒక్కొక్క పిల్లవాడు తమ బ్యాడ్ బిహేవియర్ వల్ల ఇబ్బందిలో పడతాడు. చార్లీ మాత్రం మంచిగా ఉంటూ, వాంకాకి ఇష్టం అవుతాడు. చివర్లో చార్లీ ఒక్కడే టూర్‌లో మిగులుతాడు. చార్లీకి వాంకా ఆ ఫ్యాక్టరీలో మంచి ఆఫర్ ఇస్తాడు. కానీ అతను తన ఫ్యామిలీ కోసం ఆ ఆఫర్‌ని రిజెక్ట్ చేస్తాడు. వాంకా, చార్లీ మంచితనానికి ఇంప్రెస్ అవుతాడు. చివరగా ఒక ఫీల్ గుడ్ మూమెంట్ తో ఈ సినిమాకి శుభం కార్డ్ పడుతుంది. ఆ ఫీల్ గుడ్ మూమెంట్ ఏమిటో తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : కంటికి కన్పించని శక్తి కవ్వింపు… సింగిల్ గా ఉంటే వదలకుండా అదే పని… ఒక్కో సీన్ కు వణిపోవాల్సిందే మావా