BigTV English
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (09/09/2025)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (09/09/2025)

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన సెప్టెంబర్‌ 9వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:

 వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందడానికి స్నేహితులు సలహాలు తీసుకుంటారు. వాళ్లిచ్చిన సలహాలను పాటిస్తే లాభాలు వస్తాయి. స్వీయ సానుభూతి కోసం సమయాన్ని వృధా చెయ్యకండి. ఒక ముఖ్యమైన ఫ్రెండ్‌ మీ బాధను తీరుస్తాడు. ప్రజల్లో గౌరవ మర్యాదల లభిస్తాయి. లక్కీ సంఖ్య: 1

వృషభ రాశి:

మీ కోపం వల్ల మీరు మరింత సమస్యను కొనితెచ్చుకుంటారు.  దీర్ఘకాలిక మైన మదుపులతో లాభాలను పొందుతారు. ఆలయాలు లేదా మఠాలను సందర్శిస్తారు. ప్రేమానురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. ఈరోజు చేసిన పెట్టిన పెట్టుబడులు లాభాలను తెస్తాయి. లక్కీ సంఖ్య: 9


మిథున రాశి:  

ఉద్యోగులకు ఆఫీసులో  సీనియర్ల నుంచి ఒత్తిడి ఉంటుంది. దీని వల్ల మీకు పని మీద ఏకాగ్రత లేకుండా పోతుంది. అధికంగా ఖర్చులు చేస్తారు. పొరుగు వారితో తగాదాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండండి. మీ కోపం వల్ల నష్టం జరిగే అవకాశం. లక్కీ సంఖ్య: 7

కర్కాటక రాశి:

మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు. దీర్ఘ కాలిక పెట్టుబడులను తప్పించుకొండి. అలాగ బయటకు వెళ్ళండి. మీ ఆత్మీయ మితృనితో కాసేపు సంతోషంగా గడపండి. అనుకోని కానుకలు, బహుమతులు.. బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. లక్కీ సంఖ్య: 2

సింహరాశి:

మీ శ్రీమతి వ్యహారాలలో అనవసరంగా తల దూర్చకండి. అది ఆమెకు కోపం తెప్పించవచ్చును. మీ పనులేవో మీరు చూసుకోవడం మంచిది. వీలైనంత తక్కువగా జోక్యం ఉండడం మంచిది.  మీరు డబ్బుని ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టివుంటే అవి ఈరోజు అమ్ముడుపోతాయి. దీనివలన మీకు మంచి లాభాలు ఉంటాయి. లక్కీ సంఖ్య: 9

కన్యారాశి :

పనిచేసే చోట మరియు ఇంట్లో త్తిడి వలన మీరు క్షణికోద్రేకులవుతారు. మీరు మీజీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్ధికాభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు. కొంతమందికి కుటుంబంలోకి క్రొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు, వేడుకలకు కారణమవుతుంది. ప్రతిరోజూ ప్రేమలో పడడం అనే స్వభావాన్ని మార్చుకొండి. లక్కీ సంఖ్య: 7

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడ్ లోకి వస్తారు. ఈరోజు మీయొక్క ఆర్ధిక పరిస్థితి దృఢంగా ఉంటుంది.అయినప్పటికీ మీరు మీ అతి ఖర్చులు లేక అనవసర ఖర్చులపై శ్రద్ద కలిగి ఉండాలి. ఈరోజు కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించడంతో, మీరు ప్రయోజనం పొందుతారు. లక్కీ సంఖ్య: 1

వృశ్చికరాశి:

ఈ రోజు మీరు చేపట్టిన ఛారిటీ పనులు మానసిక ప్రశాంతతను హాయిని కలిగిస్తాయి. మీకు తెలిసిన వారి ద్వారా, క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఇంట్లో ఉన్న పరిస్థితుల వలన మీరు అప్ సెట్ అవుతారు. స్నేహం గాఢమైనందువలన ప్రేమగా మారి ఎదురొస్తుంది. సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడం తో ఆఫీస్ లో పని త్వరిత గతిన అవుతుంది. లక్కీ సంఖ్య: 3

ధనస్సు రాశి:

కొన్ని తప్పనిసరి పరిస్థితులు మీకు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. కానీ మీరు నిగ్రహం వహించాలి. పరిస్థితిని చక్కబరచడానికి. ఆవేశంతో ముందుకి దూకవద్దు. తెలివిగా మదుపు చెయ్యండి. పాత స్నేహాలు, బంధాలు ఉపకరిస్తాయి.   ఒక స్నేహితుని విలువైన సపోర్ట్ మీకు వృత్తిపరమైన విషయాలలో సహాయమవుతుంది. లక్కీ సంఖ్య: 9

మకరరాశి:

ఈ రోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంది. ఎవరైనా పిలవని అతిధి మీ ఇంటికి అతిధిగా వస్తారు. వీరి యొక్క అదృష్టము మీరు ఆర్ధికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. కుటుంబంతోను స్నేహితులతోను సంతోషంగా ఉండే సమయం. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. లక్కీ సంఖ్య: 9

కుంభరాశి:

మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు. కనుక మీరు హర్ట్ అయే చోట్లకి వెళ్ళకుండా దూరంగా ఉండండి. మీచుట్టు పక్కల్లో ఒకరు మిమ్ములను ఆర్ధిక సహాయము చేయమని అడగవచ్చు. వారికి అప్పు ఇచ్చ్చేముందు వారి యొక్క సామర్ధ్యాన్ని చూసుకుని ఇవ్వండి. లేనిచో నష్టము తప్పదు. లక్కీ సంఖ్య: 6

మీనరాశి:

సంకల్ప బలం లేకపోవడం వలన మీరు భావోద్వేగం మరియు మానసిక ఉద్వేగానికి గురి అవుతారు. ఈరోజు మదుపు చెయ్యడం అనేది మీ వృద్ధిని, ఆర్థిక సురక్షణని మెరుగుపరుస్తుంది. సాయంత్రం వేళ, ఒక పాత స్నేహితుడు ఫోన్లో పలకరించి అద్భుతమైన జ్ఞాపకాలను తీసుకుని రావచ్చును. లక్కీ సంఖ్య: 4

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (26/10/2025) ఆ రాశి వారు విలువైన వస్తు, వాహనాలు కొంటారు – వారి మాటకు విలువ పెరుగుతుంది 

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (అక్టోబర్‌ 26 – నవంబర్‌ 01) మిత్రులతో అకారణ వివాదాలు – ఉద్యోగులకు ఆఫీసులో చికాకులు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (25/10/2025) ఆ రాశి వారికి వ్యాపారాల్లో లాభాలు – చేపట్టిన పనుల్లో విజయాలు 

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (23/10/2025) ఆ రాశి వారికి శుభవార్తలు –  వారికి ఊహించని సమస్యలు  

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (22/10/2025) ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారికి ఊహించని సమస్యలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (21/10/2025) ఆ రాశి ఉద్యోగులకు సమస్యలు – ప్రయాణాలు వాయిదా పడతాయి

Diwali 2025 Zodiac: 100 ఏళ్ల తర్వాత దీపావళి నాడు హంస మహాపురుష రాజయోగం.. వీరిపై కాసుల వర్షం

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (20/10/2025)  ఆ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు – వారు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి

Big Stories

×